Tamil Nadu CM MK Stalin: టార్గెట్ గవర్నర్లు..! బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ తాజా ప్రతిపాదన సంచలనంగా మారింది.

Tamil Nadu CM MK Stalin: టార్గెట్ గవర్నర్లు..! బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ

Tamil Nadu CM MK Stalin

Tamil Nadu CM MK Stalin: బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu CM MK Stalin) లేఖ రాశారు. ఈ లేఖలో ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల తీరును ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించడానికి గవర్నర్‌ (Governor) లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం (Central Govt) ను, రాష్ట్రపతి (President) ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించాలని ముఖ్యమంత్రులను కోరుతూ లేఖలో స్టాలిన్ కోరారు. ఇప్పటికే గవర్నర్ బిల్లులను ఆమోదించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ ఏప్రిల్ 10న తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.

CM MK Stalin: డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంది.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

భారత రాజ్యాంగం గవర్నర్ పాత్రతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రలు, బాధ్యతలను స్పష్టంగా సూచించిందని అన్నారు. అయితే, ప్రస్తుతం రాజ్యాంగ సూత్రాలు గౌరవించబడడం, అనుసరించడం లేదన్నది స్పష్టంగా కనిపిస్తుందని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభలు సక్రమంగా ఆమోదించి, ఆమోదంకోసం పంపిన వివిధ బిల్లులను కొందరు గవర్నర్లు నిరవధికంగా ఉంచుతున్నారని, గవర్నర్ బిల్లులను ఆమోదించకపోవడం వల్ల రాష్ట్ర పరిపాలనను స్తంభింపజేస్తున్నారని స్టాలిన్ అన్నారు. బిల్లుల ఆమోదం విషయంలో అనేక రాష్ట్రాలకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నందున, తమిళనాడులో బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రాష్ట్రపతిని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం సరైనదని భావించామని స్టాలిన్ అన్నారు.

Tamil Nadu: తమిళనాడు గవర్నర్‭కు మళ్లీ షాకిచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్

ఏప్రిల్ 10న తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని బీజేపీయేతర ముఖ్యమంత్రులకు పంపిన స్టాలిన్, తమిళనాడు తీర్మానంతో ఏకీభవిస్తారని, మీ రాష్ట్ర అసెంబ్లీలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభల సార్వభౌమాధికారం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మద్దతును అందిస్తారని భావిస్తున్నానని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ తాజా ప్రతిపాదన సంచలనంగా మారింది.