Teacher recruitment scam: బెంగాల్ మంత్రిని అరెస్టు చేసిన ఈడీ

ప‌శ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు ఇవాళ ఉద‌యం అరెస్టు చేశారు. ఉపాధ్యాయ నియామ‌క కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి కేసులో పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో నిన్న‌ సోదాలు జ‌రిపిన ఈడీ రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. గతంలో పార్థ ఛ‌ట‌ర్జీ బెంగాల్‌ విద్యాశాఖ‌ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Teacher recruitment scam: బెంగాల్ మంత్రిని అరెస్టు చేసిన ఈడీ

Partha

Teacher recruitment scam: ప‌శ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు ఇవాళ ఉద‌యం అరెస్టు చేశారు. ఉపాధ్యాయ నియామ‌క కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి కేసులో పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో నిన్న‌ సోదాలు జ‌రిపిన ఈడీ రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. గతంలో పార్థ ఛ‌ట‌ర్జీ బెంగాల్‌ విద్యాశాఖ‌ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇందులో న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి ఆరోప‌ణ‌ల‌పై ఈడీ విచార‌ణ జ‌రుపుతోంది. నిన్న రాత్రంతా పార్థ ఛ‌ట‌ర్జీని ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. ఇవాళ ఆయ‌న‌ను అరెస్టు చేసి ఈడీ కార్యాల‌యానికి త‌ర‌లించారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను వాడుకుంటూ కేంద్ర ప్ర‌భుత్వం విప‌క్ష పార్టీల నేత‌ల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోదంటూ పలు పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తోన్న స‌మ‌యంలో ప‌శ్చిమ బెంగాల్‌లో మంత్రి అరెస్టు కావడం గ‌మ‌నార్హం.


corona: దేశంలో 1,50,100కు చేరిన క‌రోనా యాక్టివ్ కేసులు