Tecno Phantom V Fold Phone : టెక్నో ఫాంటమ్ V ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది.. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు.. భారత్‌లో ఎంతంటే?

Tecno Phantom V Fold Phone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో (Tecno) మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ని ప్రకటించింది. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఫాంటమ్ V అనే పేరుతో వచ్చింది. ఈ డివైజ్ Samsung గెలాక్సీ ఫోల్డబుల్స్‌తో సమానమైన ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది.

Tecno Phantom V Fold Phone : టెక్నో ఫాంటమ్ V ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది.. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు.. భారత్‌లో ఎంతంటే?

Tecno launches Phantom V foldable phone in India at lower prices than Samsung Galaxy Fold 4

Tecno Phantom V Fold Phone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో (Tecno) మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ని ప్రకటించింది. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఫాంటమ్ V అనే పేరుతో వచ్చింది. ఈ డివైజ్ Samsung గెలాక్సీ ఫోల్డబుల్స్‌తో సమానమైన ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. లేటెస్ట్ Galaxy Z ఫోల్డ్ 4తో పోలిస్తే.. చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అయినప్పటికీ, Tecno ఫోన్ స్పీడ్ ఛార్జింగ్, బ్యాటరీకి వేరొక ఫ్లాగ్‌షిప్ చిప్ సపోర్టును అందిస్తుంది. అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు రాబోయే నెలల్లో ఒకదాన్ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి చాలా ఫోల్డబుల్ ఫోన్ ఆప్షన్లు లభిస్తాయని తెలుస్తోంది. OnePlus ఫోల్డబుల్ ఫోన్ 2023 మూడవ త్రైమాసికంలో వస్తుందని ధృవీకరించింది.

గూగుల్ కూడా ఈ ఏడాది చివర్లో ఫోల్డబుల్ లాంచ్ చేస్తుందని నివేదిక తెలిపింది. Oppo, Vivo, Xiaomi ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం (Samsung) ఆధిపత్యంలో కొనసాగుతోంది. కానీ, శాంసంగ్ మార్కెట్ వాటాను కోల్పోకుండా ఉండేందుకు కొంచెం తక్కువ ధరకు ఫోల్డబుల్ ఫోన్‌లను అందించనుంది. ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి తక్కువ ధరకే పొందవచ్చు. Tecno Phantom V ఫోల్డబుల్ ఫోన్ భారత మార్కెట్లో రూ.89,999 ప్రారంభ ధరతో వస్తుంది. Samsung Galaxy Z Fold 4 ఫోన్ భారత మార్కెట్లో రూ. 1,54,999కి అందుబాటులో ఉంది. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌లతో అదే స్థాయి ఎక్స్‌పీరియన్స్ Tecno అందించగలదా అనేది చూడాలి.

Tecno launches Phantom V foldable phone in India at lower prices than Samsung Galaxy Fold 4

Tecno launches Phantom V foldable phone in India at lower prices

Read Also : Realme GT 3 Launch : 240W ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి GT 3 ఫోన్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్లు.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

Tecno ఫాంటమ్ V ఫోల్డ్ : స్పెసిఫికేషన్‌లు ఇవే :
టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 6.42-అంగుళాల LTPO ఔటర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. శాంసంగ్ డివైజ్‌లా కాకుండా FHD+ ప్యానెల్‌తో వచ్చింది. 2296 X 2000 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 7.65-అంగుళాల 2K LTPO AMOLED ఫోల్డబుల్ డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్‌పై కనిపించే కంటెంట్ ఆధారంగా డివైజ్ ఆటోమాటిక్‌గా 10Hz నుంచి 120Hz మధ్య మారవచ్చు. హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 9000+ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ ఉంది. చిప్‌సెట్ గరిష్టంగా 12GB LPDDR5 RAM, 512GB UFS 3.1 స్టోరేజీతో వచ్చింది. లేటెస్ట్ స్టోరేజ్ వెర్షన్ కాదు. గత ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో కనిపించింది.

ఆప్టిక్స్ పరంగా చూస్తే.. 50-MP ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 13-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50-MP 2x పోర్ట్రెయిట్ కెమెరాతో కలిసి ఉంటుంది. ఈ డివైజ్ ఓపెన్ చేసినప్పుడు బయటి స్క్రీన్‌పై 32-MP కెమెరా, ముందు భాగంలో 16-MP సెన్సార్ కనిపిస్తుంది. ఫోల్డబుల్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కంపెనీ తన ఫోల్డబుల్ ఫోన్‌లో ఏరోస్పేస్-గ్రేడ్ ఇన్నోవేటివ్ డ్రాప్-షేప్ కీ ఉన్నాయని పేర్కొంది. స్టేబుల్ రొటేట్, స్లైడ్ టెక్ రివర్స్ స్నాప్ స్ట్రక్చర్‌ను కలిగి ఉంది.

Read Also : iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. విండోస్ PCల నుంచి నేరుగా ఐమెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు..!