Telangana Chief Minister : కేంద్రంపై కేసీఆర్ దూకుడు.. హైదరాబాద్ కేంద్రంగా రైతు, విద్యుత్ ఉద్యమాలు!

ఈ నెల 12, 13తేదీల్లో దేశవ్యాప్త రైతు సంఘాలతో సదస్సు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. రైతు సంఘం నేత టికాయత్‌ కూడా ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశముంది. అటు ఈ నెల మూడో వారంలో...

Telangana Chief Minister : కేంద్రంపై కేసీఆర్ దూకుడు.. హైదరాబాద్ కేంద్రంగా రైతు, విద్యుత్ ఉద్యమాలు!

Cm Kcr

Telangana Chief Minister KCR Fight Over Center : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై దూకుడు పెంచుతున్నారు. తెలంగాణ నుంచే దేశవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా రైతు, విద్యుత్‌ ఉద్యమాలను నడపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 12, 13తేదీల్లో దేశవ్యాప్త రైతు సంఘాలతో సదస్సు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. రైతు సంఘం నేత టికాయత్‌ కూడా ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశముంది. అటు ఈ నెల మూడో వారంలో విద్యుత్ సంఘాలతో హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. విద్యుత్‌శాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28, 29న దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు సమ్మెబాట పట్టనున్నాయి. విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా ఏప్రిల్‌లో సభ నిర్వహించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

Read More : Minister Harish Rao : తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసింది ? మంత్రి హరీష్ రావు

ఇప్పటికే కేంద్రంపై పోరాడేందుకు పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్..నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎంతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు ప్రజాదరణ పెరుగుతోంది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే, ఎన్సీపీ నేత శరద్ పవార్, జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ను కలిశారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేసే పోరాటాలకు మద్దతివ్వాలని కోరారు సీఎం కేసీఆర్.