CM KCR : వ్యవసాయరంగంలో కేంద్రం తీరుపట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తి

దేశంలో పంటల దిగుబడి పెంచే దిశగా కాకుండా, ఉత్పత్తని తగ్గించేలా అపసవ్య విధానాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

CM KCR : వ్యవసాయరంగంలో కేంద్రం తీరుపట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తి

Kcr

CM KCR criticized : వ్యవసాయరంగంలో కేంద్ర ప్రభుత్వం తీరుపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో మంగళవారం (ఏప్రిల్19,2022)వ తేదీన సమీక్ష నిర్వహించారు. వరి ధాన్యం సేకరణ పురోగతిపై సీఎం ఆరా తీశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేశారు. రైతాంగాన్ని నిరుత్సాహపరిచే చర్యలు చేపడుతోందన్నారు. దేశంలో పంటల దిగుబడి పెంచే దిశగా కాకుండా, ఉత్పత్తని తగ్గించేలా అపసవ్య విధానాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

Paddy Procurement : కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్, దేశం కోసం పోరాడుతాం

తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం కార్యాచరణను కొనసాగిస్తామని చెప్పారు. వానాకాలం రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు.