Telangana : కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వం, ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్

తెలంగాణలో డిజిటల్‌ సభ్యత్వం నమోదు చేయనుంది కాంగ్రెస్‌ పార్టీ. 2021, నవంబర్ 01వ తేదీ సోమవారం గాంధీభవన్‌లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని నిర్ణయించింది.

Telangana : కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వం, ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్

Gandhibhavan

Telangana Congress Digital : తెలంగాణలో డిజిటల్‌ సభ్యత్వం నమోదు చేయనుంది కాంగ్రెస్‌ పార్టీ. 2021, నవంబర్ 01వ తేదీ సోమవారం గాంధీభవన్‌లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 30లక్షల మందితో  డిజిటల్‌ సభ్యత్వం నమోదు చేయించాలని టీపీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి ఓటరు ఐడీ కార్డు ద్వారా సభ్యత్వాన్ని ఇవ్వనున్నారు. ప్రతి సభ్యునికి 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్‌ అధిష్టానం.

Read More : Huzurabad By-Election : ఫలితంపై ఉత్కంఠ, కౌంటింగ్‌కు అంతా సిద్ధం!

మంగళవారం నాడు జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ పాల్గొననున్నారు. 119 నియోజకవర్గాలకు పార్టీ కో-ఆర్డినేటర్లను త్వరలో నియమిస్తామని, మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులకు నవంబరు 9, 10 తేదీల్లో రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది టీపీసీసీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ నవంబరు 14 నుంచి ఏడు రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో జన జాగరణ పాదయాత్రలు చేపడతామని తెలిపింది.

Read More : Andhra Pradesh : వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు.. సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రదానం

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. అందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించడంతో పాటు కార్యక్రమాల నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌.