Telangana Congress : టి.కాంగ్రెస్ సీనియర్ల భేటీ…22న ఢిల్లీకి

అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంటే.. మరోవైపు, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు పాదయాత్రలతో ప్రజలకు చేరువతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ...

Telangana Congress : టి.కాంగ్రెస్ సీనియర్ల భేటీ…22న ఢిల్లీకి

T.congress

Updated On : March 20, 2022 / 7:32 AM IST

Telangana Congress Senior Leaders : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ.. నేతలు వార్తల్లోకి ఎక్కుతున్నారు. రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది పార్టీ మారుతారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హస్తం పార్టీలో నేతల మధ్య ఉన్న విబేధాలు పొడచూపుతున్నాయి. ఈ క్రమంలో.. సమావేశం కావాలని సీనియర్ నేతలు నిర్ణయించడం హాట్ టాపిక్ అయ్యింది.

Read More : Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్_లో అసలు ఏం జరుగుతోంది?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు 2022, మార్చి 20వ తేదీ ఆదివారం మరోసారి సమావేశం కానున్నారు. హస్తం పార్టీలో అసమ్మతి రాగాలు పెరుగుతుండటంతో.. సీనియర్లు అలర్ట్‌ అయ్యారు. తక్షణమే సమావేశమై కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. టీపీసీసీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలు మాత్రమే సమావేశమవుతుండటంతో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి రావాలంటూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని.. ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్‌ ఆహ్వానించారు. కాంగ్రెస్‌ నేతలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి సహా పలువురు సీనియర్ నేతలకు ఆహ్వానాలు అందాయి.

Read More : T Congress: తెలంగాణ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు

ఒకవైపు, అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంటే.. మరోవైపు, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు పాదయాత్రలతో ప్రజలకు చేరువతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. గత కొంతకాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న నేతలు రహాస్య భేటీలు నిర్వహిస్తున్నారు. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సమయం దొరికిన ప్రతిసారి ఆయనపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరోసారి ఆదివారం సమావేశం కావాలని నిర్ణయించారు పార్టీ సీనియర్లు. పీపీసీ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లి.. అధిష్టానం వద్ద పీసీసీ తీరును ఎండగట్టాలని సీనియర్లు భావిస్తున్నారు.