Warangal : MGM సూపరింటెండెంట్‌‌ని బదిలీ చేయడం ఘోరం.. సోమవారం కార్యచరణ ప్రకటన!

వరంగల్ MGM ఘటనలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ని బలి చేయడం ఘోరమని తెలంగాణా ప్రభుత్వ డాక్టర్ల సంఘం...

Warangal : MGM సూపరింటెండెంట్‌‌ని బదిలీ చేయడం ఘోరం.. సోమవారం కార్యచరణ ప్రకటన!

Warangal Mgm

Telangana Doctors Association : వరంగల్ MGM ఘటనలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ని బలి చేయడం ఘోరమని తెలంగాణా ప్రభుత్వ డాక్టర్ల సంఘం వెల్లడించింది. దమ్ముంటే శానిటైజెషన్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. డాక్టర్లు ఉండేది రోగులకు జబ్బు నయం చేయడం కోసమని, హాస్పిటల్లో ఎలుకలు, కుక్కలను పట్టడం కొసం కాదని వైద్యులు వెల్లడించారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న అపస్మారకస్థితిలో ఉన్న చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికివేసిన ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఘటనపై మంత్రి హరీశ్ రావు విచారణకు ఆదేశించారు.

Read More : Warangal : MGM సూపరింటెండెంట్ బదిలీ.. ఇధ్దరు వైద్యుల సస్పెన్షన్

అధికారుల నివేదిక ఆధారంగా టీఎస్ సర్కార్ చర్యలు తీసుకుంది. ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. గతంలో సూపరింటెండెంట్ గా ఉన్న చంద్రశేఖర్ కు పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించిన ఇద్దరు వైద్యులను సస్పెన్షన్ చేసింది. దీనిపై వైద్యులు స్పందించారు. MGM కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఇదే పరిస్ఠితి ఉందని తెలిపారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకొవాలి…లేనిపక్షంలో సోమవారం తమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు.

Read More : MGM Hospital : వరంగల్ ఎంజీఎంలో దారుణం.. పేషెంట్‌‌పై ఎలుకల దాడి.. తీవ్ర రక్తస్రావం..!

మరోవైపు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ MGM ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా.. ఆస్పత్రిలో ఎలుకలు కొరకడం వల్లే పేషెంట్ శ్రీనివాస్‌ ఆరోగ్యం దెబ్బతిన్నదనడంలో వాస్తవం లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఆస్పత్రిని పరిశీలించిన ఆయన.. శ్రీనివాస్‌కు చాలా అనారోగ్య సమస్యలున్నాయని చెప్పారు. అయితే ఆస్పత్రిలో కొంత పొరపాటు జరిగిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుందన్న ఆయన.. దీనికి బాధ్యలు ఎవరైనా సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని చెప్పారు. అటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు..డీఎమ్‌ఈ రమేశ్‌. ఇప్పటికే పేషెంట్ శ్రీనివాస్‌కు మల్టీ ఆర్గాన్స్‌ దెబ్బతిన్నాయని .. అత్యాధునిక చికిత్స అందించేందుకు నిమ్స్‌కు తరలిస్తామని చెప్పారు.