Telangana : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు..ఎంపీ, ఎమ్మెల్సీలతో టెన్షన్..అసలు విషయం ఏమిటంటే..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. ఎంపీ, ఎమ్మెల్సీలతో టెన్షన్ పట్టుకుంది. అసలు మేటర్‌లోకి వెళితే.. ఇప్పుడున్న ఎమ్మెల్సీల్లో కొందరు.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చూస్తున్నారు

Telangana : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు..ఎంపీ, ఎమ్మెల్సీలతో టెన్షన్..అసలు విషయం ఏమిటంటే..

For Trs Mlas .. Tension With Mps And Mlas

TRS MLAs .. Tension with MPs and MLAs : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. ఎంపీ, ఎమ్మెల్సీలతో టెన్షన్ పట్టుకుంది. కొత్తగా అనిపించింది కదా. ఇప్పుడే ఏమైంది. ఇలాంటివి.. ఇంకా చాలా చూడాలి. అసలు మేటర్‌లోకి వెళితే.. ఇప్పుడున్న ఎమ్మెల్సీల్లో కొందరు.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చూస్తున్నారు. అందుకు అనుగుణంగా.. నియోజకవర్గాల్లో రాజకీయం కూడా మొదలెట్టేశారు. దీంతో.. కొన్ని చోట్ల అధికార పార్టీలో.. ఆధిపత్య పోరుతో కొత్త సమస్యలొస్తున్నాయ్. మరి.. ఎంపీ, ఎమ్మెల్సీలను ఎదుర్కొనేందుకు.. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఏమేం.. చేయబోతున్నారు?

అధికార పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా.. వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ తమదేనన్న ఆశల్లో తేలుతున్నారు. ఇప్పటి నుంచే జనంలో ఉంటున్నారు. అయితే.. కొన్ని సెగ్మెంట్లలో మాత్రం.. ఎమ్మెల్సీలు, ఎంపీల నుంచి ఊహించని చిక్కులు ఎదురవుతాయేమోనన్న ఆందోళనలో ఉన్నారు. పార్టీ రెండు సార్లు చాన్స్ ఇచ్చినా.. ఈసారి అవకాశం వస్తుందో.. లేదోనన్న అనుమానాలు వెంటాడుతున్నాయ్. ఒకే నియోజకవర్గంలో.. ఇద్దరు, ముగ్గురు కీలక నేతలున్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పదవుల్లోనే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నామనే సంకేతాలు పంపుతున్నారు. ఇదే.. ఇప్పుడు చాలా చోట్ల హాట్ టాపిక్‌గా మారింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్.. పెద్దపల్లి నుంచి బరిలోకి దిగేందుకు సై అంటున్నారు. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్ కూడా.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్లు.. కేడర్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికుంటాయన్నదే ఇంట్రస్టింగ్ పాయింట్. వ‌రంగ‌ల్ జిల్లాలో ఉద్యమకాలం నాటి నుంచి పార్టీలో యాక్టివ్‌గా ఉన్న పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలని.. టీఆర్ఎస్ పెద్దలను కోరుతున్నారట. జిల్లాలో.. ఎక్కడ అవకాశం ఇచ్చినా పోటీ చేసేందుకు సై అంటున్నారని.. గుసగుసలు వినిపిస్తున్నాయ్. దీంతో.. ఎవరి బెర్త్‌కు.. ఎర్త్ పెడతారోనన్న చర్చ సాగుతోంది. మంత్రి సత్యవతి రాథో‌డ్ కూడా వచ్చే ఎన్నికల్లో.. డోర్నకల్ నుంచి పోటీ చేయాలనే ఆశతో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఎంపీ మాలోత్ కవిత కూడా డోర్నకల్ నుంచి గానీ మహబూబాబాద్ నుంచి గానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు.

వికారాబాద్ జిల్లా తాండూరులో.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ఇప్పటికే చెప్పేశారు. గ్రౌండ్‌లోకి దిగి.. టూర్లు కూడా వేసేస్తున్నారు. దీంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో చాన్స్ దక్కుతుందా? పార్టీ.. పట్నంకే పట్టం కడుతుందా.. అన్న చర్చ కేడర్‌లో మొదలైంది. ఇక.. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి.. గత ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినా.. చాన్స్ దక్కలేదు. ఈసారి.. కచ్చితంగా టికెట్ వస్తుందన్న ధీమా కసిరెడ్డి వర్గంలో కనిపిస్తోంది.

నిజామాబాద్‌లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత.. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీ చేస్తారా? అసెంబ్లీ బరిలో నిలుస్తారా? అన్నదానిపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఆమె మాత్రం.. చట్ట సభలకు వెళ్లాలని భావిస్తున్నట్లు.. గుసగుసలు వినిపిస్తున్నాయ్. నల్గొండ జిల్లాలో ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన.. కోటిరెడ్డి నాగార్జునసాగర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాననే.. సంకేతాలు కేడర్‌కు పంపుతున్నారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్ని నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. తమకు ఏమాత్రం చాన్స్ దొరికినా.. అసెంబ్లీ రేసులో ఉన్న నేతలకు బ్రేకులు వేస్తున్నారు. దీంతో.. నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ఎక్కువైంది. అయితే.. పార్టీ అధిష్టానం మాత్రం.. ప్రస్తుతం జరుపుతున్న సర్వే రిపోర్టులు, ఎన్నికల నాటికి ఉండే పరిస్థితులకు అనుగుణంగా.. ఫైనల్ డెసిషన్ తీసుకునే చాన్స్ ఉంది.