Telangana High Court : బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కల్గించారని సస్పెన్షన్ విధించారు.

Telangana High Court : బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

High Court

BJP MLAs Suspension : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు అయింది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. రిలీఫ్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.

సభా కార్యకలాపాలకు ఆటంకం కల్గించారని బీజేపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ విధించారు. అయితే తమ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సభ ముగిసే వరకు సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

BJP MLAS : సస్పెన్షన్‌పై హైకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన తొలి రోజు (సోమవారం).. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల‌ను బ‌డ్జెట్ సమావేశాల నుంచి స‌స్పెండ్ చేస్తూ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు.

స‌భ మొద‌లైన రెండు నిమిషాల‌కే త‌మ‌ను ఎలా సస్పెండ్ చేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యేల‌తో పాటు ఆ పార్టీ కీల‌క నేత‌లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించారు. తమపై సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Minister Harish Rao : తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీ సభ్యుల సస్పెండ్

రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తమను సస్పెండ్ చేశారని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టుని కోరారు.