Telangana lockdown Extended : తెలంగాణ లాక్ డౌన్ సడలింపులు..భూములు, ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతులు

తెలంగాణలో లాక్‌డౌన్‌ మరోసారి పొడిగించింది ప్రభుత్వం. ప్రగతి భవన్‌లో సమావేశమైన కేబినెట్‌... జూన్‌ 10 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్‌డౌన్‌లో మరికొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది సర్కార్‌. అంతేకాదు.. లాక్‌డౌన్‌ సడలింపు సమయాన్ని కూడా పెంచింది. మరో మూడు గంటలు సడలింపు సయమాన్ని పెంచింది.

Telangana lockdown Extended : తెలంగాణ లాక్ డౌన్ సడలింపులు..భూములు, ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతులు

Tg Lockdown

Telangana Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్‌ మరోసారి పొడిగించింది ప్రభుత్వం. ప్రగతి భవన్‌లో సమావేశమైన కేబినెట్‌… జూన్‌ 10 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్‌డౌన్‌లో మరికొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది సర్కార్‌. అంతేకాదు.. లాక్‌డౌన్‌ సడలింపు సమయాన్ని కూడా పెంచింది. మరో మూడు గంటలు సడలింపు సయమాన్ని పెంచింది. దీని ప్రకారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్‌డౌన్‌ నుంచి అన్నింటికి మినహాయింపు ఇచ్చింది.

మరో గంట అదనపు సమయాన్ని ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు, వ్యాపారులు తమ ఇళ్లకు చేరుకోవడానికి వీలుకల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలోనే ప్రజలంతా తమ పనులు ముగించుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కరోనా చైన్‌ను తెంచాలంటే ప్రజలాంతా లాక్‌డౌన్‌ను సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

లాక్‌డౌన్‌ సడలింపు సమయం పొడిగించడంతో… కొన్నింటికి సడలింపులు ఇచ్చింది కేబినెట్‌. రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. సోమవారం నుంచి మళ్లీ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ పనిదినాల్లో ఈ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందించనున్నాయి. లాక్‌డౌన్‌తో సర్కార్‌ ఆదాయం తగ్గడంతో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్లకూ ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని ఆర్‌టీఏ ఆఫీసులు పని చేయనున్నాయి. ఇన్ని రోజులు ఆగిపోయిన నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు మళ్లీ ఊపందుకోనున్నాయి.

Read More : Metro Train : లాక్ డౌన్ సడలింపులు, మెట్రో రైళ్ల టైమింగ్ లో మార్పులు..ఇవే