Metro Train : లాక్ డౌన్ సడలింపులు, మెట్రో రైళ్ల టైమింగ్ లో మార్పులు..ఇవే
హైదరాబాద్ లో మెట్రో రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. లాక్‌డౌన్ రిలాక్సేషన్ సమయాన్ని పెంచడంతో.. మెట్రో అధికారులు సైతం మెట్రో సర్వీసు వేళల్లో మార్పులు చేశారు.

Hyd Metro
Telangana Lockdown Extension : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా కట్టడికి టి.సర్కార్..20 గంటల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. 2021, మే 30వ తేదీ ఆదివారంతో లాక్‌డౌన్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో..తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. లాక్ డౌన్ జూన్ 10వ తేదీ వరకు పొడిగించనున్నట్లు, మయంలో సడలింపులు ఇస్తున్నట్లు కేబినెట్ వెల్లడించింది.
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్‌డౌన్ నుంచి అన్నింటికి మినహాయింపు ఇచ్చింది. మరో గంట అదనపు సమయాన్ని ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు, వ్యాపారులు తమ ఇళ్లకు చేరుకోవడానికి వీలుకల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో…హైదరాబాద్ లో మెట్రో రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. లాక్‌డౌన్ రిలాక్సేషన్ సమయాన్ని పెంచడంతో.. మెట్రో అధికారులు సైతం మెట్రో సర్వీసు వేళల్లో మార్పులు చేశారు. 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ట్రైన్స్ నడవనున్నాయి. హైదరాబాద్‌లోని మూడు కారిడార్లలోని స్టేషన్లలో 11 గంటల 45 నిమిషాలకే చివరి ట్రైన్లు ప్రారంభమై.. 12 గంటల 45 నిమిషాలకు గమ్యస్థానాలకు చేరుకోన్నాయి.
Read More : Bengal Chief Secretary : మోడీ వర్సెస్ దీదీ..తారాస్థాయికి సీఎస్ వివాదం