Telanganan Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే?

తెలంగాణలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కొత్తగా 459 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Telanganan Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే?

Ts Covid

Telanganan Corona Cases: తెలంగాణలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కొత్తగా 459 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 323 పాజిటివ్ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే

ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం 22,193 మందికి కోవిడ్ రాపిడ్ పరీక్షలను వైద్య సిబ్బంది నిర్వహించారు. 459 మందికి కొవిడ్ పాజిటివ్ అని తేలగా, 127 నమూనాల ఫలితాలు రావాల్సిఉంది. యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 5,180కి చేరుకుంది. మొత్తం 468 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ కోలుకున్నారు. తెలంగాణ ఆరోగ్య శాఖ ఇప్పటివరకు 3,58,62,191 కోవిడ్ పరీక్షలను నిర్వహించింది. కోవిడ్ సోకినవారి సంఖ్య 8,06,124గా ఉండగా, 7,96,833 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.85 శాతంగా నమోదైంది.

రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో పాటు, చల్లటి వాతావరణం కారణంగా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలని, అనవసర ప్రయాణాలు చేయొద్దని, పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.