Minister KTR : కాంగ్రెస్, బీజేపీని తప్పకుండా ప్రజలు బండకేసి కొడతారు : మంత్రి కేటీఆర్

చారిత్రక అనివార్యత కోసమే కేసీఆర్ జాతీయ నాయకత్వంలో వెళ్ళారని వెల్లడించారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోయే నాయకుడు ఎవరు లేరన్నారు.

Minister KTR : కాంగ్రెస్, బీజేపీని తప్పకుండా ప్రజలు బండకేసి కొడతారు : మంత్రి కేటీఆర్

Minister KTR : అనాడు గులాబీ జెండా ఎగురేసే క్రమంలో కేసీఆర్ సాధారణ వ్యక్తి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అనే పదాన్ని కేసీఅర్ ఎత్తుకున్నారని చెప్పారు. రేడియో మాత్రం ఉందని.. ఖమ్మంలో ఉద్యమం ప్రారంభం అయిందని 1969లో ప్రొఫెసర్ జయశంకర్ చెప్పారని గుర్తు చేశారు. 30 ఏళ్ల తరువాత మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం మొదలు పెట్టారని తెలిపారు. తప్పు చేసినా, ఎత్తిన జెండా దించినా, తెలంగాణ తేకున్నా రాళ్ళతో కొట్టి చంపండి అని మొట్ట మొదటి సింహ గర్జనలో సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి ప్లీనరీ, పార్టీ ఆవిర్భావ సభకి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పార్టీ జెండా ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులు అర్పించారు. బీఅర్ఎస్ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం నాయకత్వంలో పని చేయడం పూర్వజన్మ సుకృతం అన్నారు. సీఎం కేసీఆర్ గురించి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎంతో గొప్పగా చెప్పారని గుర్తుచేశారు.

Minister KTR : కేంద్రం సహకరించకపోయినా.. హైదరాబాద్ లో 250 కి.మీ మెట్రోను తీసుకొస్తాం : మంత్రి కేటీఆర్

ఎట్లున్న సిరిసిల్ల..నేడు ఎట్లా అయిందన్నారు. రాష్ట్రం, కేంద్రం బాగు పడాలంటే ఎవరి పని వారు చేయాలని చెప్పారు. బీఅర్ఎస్ మారింది పేరు మాత్రమే… డీఎన్ఏ మారలేదని స్పష్టం చేశారు. 2010 నుండి 2014 వరకు గుజరాత్ లో జరగని అభివృద్ధి జరిగింది అని చెప్పి నరేంద్ర మోదీ పీఎం అయ్యారని చెప్పారు. మహారాష్ట్రలో రైతులు కేసీఅర్ వెంట ఉన్నారని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ రైతులను పట్టించు కోలేదని విమర్శించారు.

చారిత్రక అనివార్యత కోసమే కేసీఆర్ జాతీయ నాయకత్వంలో వెళ్ళారని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీని తప్పకుండా ప్రజలు బండ కేసి కొడతారని చెప్పారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోయే నాయకుడు ఎవరు లేరన్నారు. బ్రెయిన్ లేని బంటి, పార్టీలు మారే వారితో కేసీఅర్ పోటీ పడలా అని అన్నారు. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారు కేసిఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం వలన అందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

KTR: ఇక కదలాలి.. వచ్చే ఎన్నికలకు గులాబీ సైన్యం సమరోత్సాహంతో కదంతొక్కాలి: కేటీఆర్

ఇది ఎన్నికల ఏడాది.. చిన్న పామునైనా పెద్ద కట్టేతోనే కొట్టాలన్నారు. తనను మీరు దయతో 89 వేళ ఓట్ల మెజార్టీతో గెలిపించారని.. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడి పోయామని చెప్పారు. మతం పేరు మీద..విచిత్ర ఎంపీని తెచ్చుకున్నామని తెలిపారు. ఆదమర్చి ఉండకూడదు అలెర్ట్ గా ఉండాలన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సీటును ఈసారి వదులుకునే పరిస్థితి లేదు..సిరిసిల్ల మెజార్టీతో గెలవాలన్నారు.