Telangana : KCR లో K అంటే కాలువలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు : KTR

మంత్రి కేటీఈర్ కేసీఆర్ అనే పేరుకు కొత్త అర్థం చెప్పారు ‘కేసీఆర్’ లో కే అంటే కాలువలు,సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అంటూ వివరించారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Telangana : KCR లో K అంటే కాలువలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు : KTR

Ktr

Telangana :  మంత్రి కేటీఈర్ కేసీఆర్ అనే పేరుకు కొత్త అర్థం చెప్పారు ‘కేసీఆర్’ లో కే అంటే కాలువలు,సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అంటూ వివరించారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చైనా అభివృద్ధిలో దూసుకుపోతుంటే బీజేపీ పాలనలో భారత్ మాత్రం వెనుకబడిపోతోంది అంటూ విమర్శించారు.బీజేపీ నేతలు నోరు విప్పితే వివాదాల వ్యాఖ్యలు చేయటం తప్ప ఇంకేమీ మాట్లాడలేని..ఓ ఎంపీ దేవుళ్లను పేరుతో రాజకీయాలు చేసే మరో నేత గోవులు ఆవులు అంటూ వివాదాలు రేపుతుంటారని..ఇదేనా బీజేపీ ప్రభుత్వం భారత్ లో చేస్తున్న అభివృద్ధి అంటూ ఎద్దేవా చేశారు.

దేవుళ్ల పేరుతో ప్రజలు ఒకరిపై మరొకకు విద్వేషాలు పెంచుకోవాలనే యోచన బీజేపీదేనని అన్నారు. దేవుళ్ల పేరుతో ప్రజలు కొట్టుకోవాలని బైబిల్, ఖురాన్, భగవద్గీతలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ మాత్రం మతరాజకీయాలను ప్రోత్సహిస్తు పబ్బం గడుపుకుంటోందని ఎద్దేవా చేశారు. భారత్ లో 25 కోట్ల మంది ముస్లింలు ఎందుకు ఆందోళన చేయాల్సిన పరిస్థితులు వచ్చింది అని ప్రశ్నించారు. 1987లో భారత్-చైనా ఆర్థిక స్థితిలో సమానంగా ఉండేవి. అటువంటిది ఇప్పుడు చైనా ఆర్థిక స్థితిలో దూసుకుపోతుంటే భారత్ మాత్రం వెనుకబడిపోయిందని ఇది బీజేపీ పాలన వచ్చిన దుస్థితి అని కేటీఆర్ విమర్శించారు.

ల‌కారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన‌ను మంత్రి పువ్వాడ అజ‌య్‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్ల‌తో తీగ‌ల వంతెన‌ను నిర్మించారు. మ్యూజిక‌ల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభించారు. ర‌ఘునాథపాలెంలో రూ. 2 కోట్ల‌తో నిర్మించిన ప్ర‌కృతి వ‌నాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. ఒకే ఒక్క రోజు రూ. 100 కోట్ల‌తో నిర్మించిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఇవాళ ఖ‌మ్మంలో ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. గ‌తంలో మురికి కూపంగా ఉన్న ల‌కారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశారు. ల‌కారం చెరువు వ‌ద్ద‌ తీగ‌ల వంతెనను ఏర్పాటు చేశాం.

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో జ‌రుగుతున్న అభివృద్ధి మ‌రో కార్పొరేష‌న్‌లో జ‌ర‌గ‌డం లేదు. ఖ‌మ్మం న‌గరాన్ని నెంబ‌ర్‌వ‌న్‌గా మార్చాల‌న్న‌ది మంత్రి అజ‌య్ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అభివృద్ధిని చూడ‌లేక‌ అసూయ‌తో కొంద‌రు లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. 1987లో భార‌త‌దేశం ఆర్థిక ప‌రిస్థితి, చైనా ఆర్థిక ప‌రిస్థితి సేమ్. కానీ ఈ 35 ఏండ్ల త‌ర్వాత చూస్తే.. చైనా 16 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌తో ముందుకు దూసుకుపోయింది. మ‌నం మాత్రం 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌తో వెనుక‌బ‌డిపోయాం. పేద‌ల సంక్షేమం, దేశ పురోగతి, అభ్యున్న‌తి, ఎదిగిన దేశాల‌తోనే మా పోటీ అని చైనా ప్ర‌క‌టించి, అభివృద్ధిపై దృష్టి సారించింది. ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్‌గా చైనా ఎదిగింద‌న్నారు. మ‌న‌కేమో కుల పిచ్చి, మ‌త పిచ్చి ఎక్కువైపోయింది. దీంతో అభివృద్ధి అడుగంటి పోయింది. పంచాయితీలు పెట్టుకోవాల‌ని ఏ దేవుడు కూడా చెప్ప‌లేదని కేటీఆర్ పేర్కొన్నారు.