TSRTC Bus Tracking App : మీరు వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు.. అందుబాటులోకి ‘టీఎస్‌ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’ యాప్‌

సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.

TSRTC Bus Tracking App : మీరు వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు.. అందుబాటులోకి ‘టీఎస్‌ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’ యాప్‌

TSRTC

TSRTC Bus Tracking App : సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. సంక్రాంతి సందర్భంగా సీటు రిజర్వేషన్ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతో పాటు బస్ ట్రాకింగ్ లింక్ ను కూడా మెసేజ్ రూపంలో పంపుతున్నారు. లింక్ పై క్లిక్ చేయగానే సంబంధిత బస్సు ఎక్కడుందో సులువుగా తెలుసుకునే అవకాశం ఉంది.

టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. www.tsrtc.telangana.gov.in నుంచి కూడా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే బస్సుల వివరాలతోపాటు అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో సులువుగా తెలుసుకోవచ్చు. బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం తదితర వివరాలను ప్రయాణికులు ఈ యాప్ లో నమోదు చేసుకునే వీలుంది.

TSRTC Bumper Offer : సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

ప్రస్తుతం రిజర్వేషన్ చేసుకునే 1,800 టీఎస్ఆర్టీసీ బస్సులకు బస్ ట్రాకింగ్ సౌకర్యం కల్పించామని
టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. పండుగ సందర్భంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో వారి ఫోన్లకు బస్సు ట్రాకింగ్ లింక్ ను మెసేజ్ రూపంలో పంపిస్తున్నామని చెప్పారు. త్వరలో హైదరాబాద్ సిటీ బస్సులకు ఈ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.