Tollywood : సినీ సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక సమావేశం

గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కుంటుండటంతో సినీ పెద్దలు ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నేడు జూన్ 25న మధ్యాహ్నం 3.00 గంటలకు సినీ సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.

Tollywood : సినీ సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక సమావేశం

Tfcc

Telugu Film Chamber of Commerce :  గత కొన్ని రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. అందులో ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు, థియేటర్లకు జనాలు రాకపోవడం, ఓటీటీ రిలీజ్ లు, పరిశ్రమలోని అంతర్గత ఇబ్బందులు.. ఉన్నాయి. గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కుంటుండటంతో సినీ పెద్దలు ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నేడు జూన్ 25న మధ్యాహ్నం 3.00 గంటలకు సినీ సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.

Aamir khan : సౌత్ సినిమాలు బాగా ఆడుతున్నాయి.. అందుకే నా సినిమాకి చిరంజీవిని హెల్ప్ అడిగాను..

ఫిల్మ్ ఛాంబర్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఫిలిం ఛాంబర్ మెంబర్స్ తో పాటు సినీ ప్రముఖులు, అగ్ర నిర్మాతలు రానున్నారు. మీటింగ్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో సెక్టార్ సభ్యులు కూడా పాల్గొననున్నారు. ఓటీటీ, టికెట్ ధరలు, విపిఎఫ్ ఛార్జీలు, సినిమా నిర్మాణ ఖర్చు, హీరోల రెమ్యునరేషన్స్, కార్మికుల సమస్యలు, ఫైటర్స్ యూనియన్ సమస్యలు, ఫెడరేషన్ సమస్యలు, మేనేజర్ ల పాత్ర, మిగిలిన సమస్యలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఇటీవల కొన్ని రోజులు షూటింగ్ లు బంద్ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. దానిపై కూడా చర్చించనున్నారు.