Telugu Stars: ప్రజల కోసం సివిల్ సర్వెంట్స్.. రూటు మార్చిన మాస్ హీరోలు!

రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, రవితేజ ఈ మాస్ హీరోలందరూ సివిల్ సర్వెంట్స్ గా మారిపోయారు. అందరి మాట ఒకటే పబ్లిక్ సర్వీస్.. ఇంతకీ ఎక్కడ, ఎప్పుడు లాంటి..

Telugu Stars: ప్రజల కోసం సివిల్ సర్వెంట్స్.. రూటు మార్చిన మాస్ హీరోలు!

Telugu Stars

Updated On : March 27, 2022 / 11:02 AM IST

Telugu Stars: రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, రవితేజ ఈ మాస్ హీరోలందరూ సివిల్ సర్వెంట్స్ గా మారిపోయారు. అందరి మాట ఒకటే పబ్లిక్ సర్వీస్.. ఇంతకీ ఎక్కడ, ఎప్పుడు లాంటి క్వశ్ఛన్ బ్యాంక్ ను బయటకు తీయొద్దు.. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Telugu Star Heroes: పాన్ ఇండియా రేంజ్.. బాలీవుడ్‌లో టాలీవుడ్ హీరోల క్రేజ్

ఇప్పుడు మాస్ హీరోలు పబ్లిక్ సర్వీస్ బాట పడుతున్నారు. నితిన్ కూడా కలెక్టర్ గా సిద్ధార్థ రెడ్డి క్యారెక్టర్ లో చార్జ్ తీసుకుంటున్నాడు. నితిన్ లేటెస్ట్ గా నటిస్తున్న మాచర్ల నియోజక వర్గం సినిమాలో కలెక్టర్ రోల్ పోషించి, పబ్లిక్ కు సర్వీస్ చేయబోతున్నాడు. ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజశేఖర్ రెడ్డి డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Telugu Star Hero’s: సక్సెస్ కోసం ఎదురుచూపులు.. కోటి ఆశలతో కొత్త ఏడాది!

అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో మెరుపులు పుట్టిస్తూ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్న రామ్ చరణ్. శంకర్ డైరెక్షన్ లో సివిల్ సర్వెంట్ గా కనిపించబోతున్నాడు. ప్రతీ సినిమాను సోషల్ మెసేజ్ తో కన్వే చేసే శంకర్, రామ్ చరణ్ తో ఎలాంటి సమస్యలకు చెక్ పెట్టిస్తాడో, ఎలాంటి పబ్లిక్ సర్విస్ చేపిస్తాడో చూడాలనుకుంటున్నారు అభిమానులు.

Telugu Star Hero’s: ఒక్క హిట్టు.. ఇప్పుడు ఆశలన్నీ ఒక్క హిట్టుపైనే

ఇంకా శరత్ మండవ తెరకెక్కిస్తున్న రామారావు ఆన్ డ్యూటీలో మాస్ రాజ రవితేజ కూడా రెవెన్యూ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం సామాన్య జనం ఫేస్ చేస్తున్న సమస్యల్లో రెవెన్యూ ఇష్యూస్ మేజర్ రోల్ పోషిస్తున్నాయి. రామారావు రెవెన్యూ ఆఫీసర్ గా ఎలాంటి సమస్యలకు సొల్యూషన్స్ ఇచ్చి మెప్పిస్తారో చూడాలి. ఆల్రెడీ దేవకట్టా డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ కలెక్టర్ గా రిపబ్లిక్ సినిమా వచ్చింది. సాయి తేజ్ ఆ క్యారెక్టర్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. మాస్ హీరోలు చరణ్, రవితేజ నితిన్, సివిల్ సర్వెంట్స్ గా కనిపించి ఎలా మెప్పిస్తారో చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్.