Lab Grown Meat : కృత్రిమ మాంసం.. ల్యాబ్ మీట్ పై సీసీఎంబీ పరిశోధనలు

దేశం(India)లో కృత్రిమ మాంసం రాబోతుంది. మాంసానికి ప్రత్యామ్నాయంగా ల్యాబ్ గ్రోన్ మీట్(Lab Grown Meat)(కృత్రిమ మాంసం)కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రంగంలో స్టార్టప్ లకు మంచి భవిష్యత్తు ఉండనుంది.

Lab Grown Meat : కృత్రిమ మాంసం.. ల్యాబ్ మీట్ పై సీసీఎంబీ పరిశోధనలు

Lab grown meat

Lab Grown Meat : దేశం(India)లో కృత్రిమ మాంసం రాబోతుంది. మాంసానికి ప్రత్యామ్నాయంగా ల్యాబ్ గ్రోన్ మీట్(Lab Grown Meat)(కృత్రిమ మాంసం)కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రంగంలో స్టార్టప్ లకు మంచి భవిష్యత్తు ఉండనుంది. దేశంలో మాసం తింటున్నవారి సంఖ్య పెరిగింది. దేశ వ్యాప్తంగా మాంసం వినియోగం ఏటా 16శాతం పెరుగుతోంది. ప్రస్తుతం 80 శాతం మంది మాంసాహారులే ఉండటం గమనార్హం. అయితే, మాంసం వినియోగానికి తగ్గట్లుగా డిమాండ్ ను భర్తీ చేయటం సమస్యగా మారింది. ఈ క్రమంలో కృత్రిమ మాంసానికి ప్రాధాన్యం ఏర్పడింది.

జంతు కణాలను ప్రత్యేక పద్ధతిలో సేకరించి, వాటి నుంచి మాంసాన్ని పోలిన పదార్థాన్ని ల్యాబ్ లో అభివృద్ధి చేయనున్నారు. ఇది పర్యావరణ హితమని చెప్పవచ్చు. 2019 నుంచి ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(CCMB) ల్యాబ్ మీట్ పై పరిశోధనలు చేస్తోంది. ఇది 2025 నాటికి అన్ని రకాల అనుమతులతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Artificial Heart : కృత్రిమ గుండె.. రెండేళ్లలో మనుషులకు ఇంప్లాంట్

ఒకవైపు దేశ వ్యాప్తంగా మాంసానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ మాంసం వినియోగం పెరుగుతోంది. స్టాటిస్టిక్స్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన అధ్యయనంలో 93శాతం తెలంగాణలో మాంసాహారులే ఉండగా, ఉత్పత్తి కూడా విపరీతంగా పెరిగింది. 2013 నుంచి 2021 నాటికి 6 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది.

ఒకప్పుడు సగటున ఒక వ్యక్తి 12.95 కిలోల మాంసాన్ని వినియోగించేవాడు. 2021-22 నాటికి వ్యక్తిగత మాంసం వినియోగం 22.55 కిలోలకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో పాడి, పశు, మత్స్య సంపద అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అయితే కృత్రిమ మాంసం అందుబాటులోకి వస్తే మాంసం కోసం కోళ్లు, మేకలను కోయాల్సిన అవసరం ఉండకపోవచ్చు.