Criminal Procedure Act : క్రిమినల్‌ ప్రొసీజర్‌ చట్టం అమలు

దోషులు, అనుమానితుల కొలతలు, బయోమెట్రిక్‌, జీవ శాంపిల్స్ ను సేకరించేందుకు అవకాశం కల్పించే క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గురువారం (ఆగస్టు6,2022) కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ప్రిజనర్స్‌ యాక్ట్‌-1920 స్థానంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

Criminal Procedure Act : క్రిమినల్‌ ప్రొసీజర్‌ చట్టం అమలు

Criminal Procedure Act

Criminal Procedure Act : దోషులు, అనుమానితుల కొలతలు, బయోమెట్రిక్‌, జీవ శాంపిల్స్ ను సేకరించేందుకు అవకాశం కల్పించే క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గురువారం (ఆగస్టు6,2022) కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ప్రిజనర్స్‌ యాక్ట్‌-1920 స్థానంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి దర్యాప్తు ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయడానికే ఈ చట్టాన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ బిల్లుకు ఏప్రిల్‌లోనే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులకు ఈ చట్టం ద్వారా డీఎన్‌ఏ, శాంపిల్స్ సేకరించే విషయంలో అపరిమిత అధికారాలు సంక్రమించనున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Criminal Laws : క్రిమినల్‌ చట్టాల్లో సమగ్ర మార్పులు

క్రిమినల్‌ ప్రొసీజర్‌ చట్టం ప్రకారం..దోషులతో పాటు నేర నిరూపణ కాని నిందితులు, విచారణలో ఉన్న ఖైదీలు, అనుమానితుల నుంచి వేలి, కాలి, అరచేతి ముద్రలు, ఐరిస్‌, రెటీనా స్కాన్‌, చేతిరాత, సంతకం, రక్తం, మూత్రం, వీర్యం వంటి నమూనాలు సేకరించడంతో పాటు ఇతర పరీక్షలు చేపట్టడానికి ఈ చట్టం పోలీసులకు అవకాశం కల్పిస్తుంది. 1920 నాటి చట్టంలో శిక్ష పడ్డవారి నుంచే నమూనాలను తీసుకునే వీలుండేది. తాజా చట్టం ద్వారా అండర్‌ ట్రయల్స్‌, నేరంలో పాలుపంచుకున్నట్లు అనుమానం ఉన్నవారి నుంచి కూడా శాంపిల్స్ తీసుకోవడానికి ఈ చట్టం అనుమతిస్తుంది.

సెక్షన్‌ 4(2) కింద నిందితులకు సంబంధించిన రికార్డులను సేకరించిన నాటి నుంచి 75 ఏళ్ల పాటు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీబీ) నిల్వచేయవచ్చు. 21వ అధికరణ ప్రసాదించిన జీవించే హక్కును ఇది కాలరాయడమే అవుతుందని పలువురు అంటున్నారు. నిందితుల డాటా కలిగి ఉన్న ఎన్సీబీ కేంద్రం పరిధిలోనిది. పోలీసు వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోనిది.

Body Cams: ఖైదీలపై నిఘా.. క్రిమినల్స్ కోసం బాడీ కెమెరాలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసి అరెస్టైన వారి వ్యక్తిగత వివరాలు, నమూనాలను కూడా ఈ చట్టం సాయంతో సేకరించే ప్రమాదం ఉంది. వేరే ఇతర కేసుల్లో ఈ వివరాలను పోలీసులు వినియోగించుకునే వీలుంది. ఎందుకంటే ఏ స్థాయిలో నేరానికి నమూనాలు సేకరించాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో స్పష్టత ఇవ్వలేదు.