Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు

రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో 2019 డిసెంబర్‌ 6న దిశ హత్యాచారం తర్వాత పోలీస్‌ కస్టడీలో ఉన్న నిందితులు నలుగురు...సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు

Disha Case

Supreme Court : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు, ఎన్‌కౌంటర్‌ నివేదికపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎన్‌కౌంటర్‌ నిజమా… బూటకమా.. అనేది ధర్మాసనం తేల్చనుంది. దిశ కేసులో జస్టిస్ సిర్పూర్కర్‌ కమిషన్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో 2019 డిసెంబర్‌ 6న దిశ హత్యాచారం తర్వాత పోలీస్‌ కస్టడీలో ఉన్న నిందితులు నలుగురు…సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.

ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్‌ కమిషన్‌ను కోర్టు నియమించింది. 47 రోజుల పాటు క్షేత్రస్థాయిలో జస్టిస్‌ సిర్పూర్కర్‌, రేఖ ప్రకాశ్‌, కార్తికేయన్ విచారణ జరిపారు. పోలీసు అధికారులు, మృతుల కుటుంబాలు, సాక్షులను ప్రశ్నించారు.

Disha Encounter: దిశ ఎన్‌కౌంటర్ కేసులో హైపవర్ కమీషన్ ముందు సజ్జనార్.. ప్రశ్నలివే!

ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిణామాలపై సర్కార్‌ ఏర్పాటు చేసిన సిట్‌…తన రిపోర్ట్‌ను 2020 ఫిబ్రవరి 25న జస్టిస్ సిర్పూర్కర్‌ కమిషన్‌ సభ్యులకు అందచేసింది. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు లేవనెత్తుతూ నిందితుల కుటుంబసభ్యులు అఫిడవిట్‌ సమర్పించారు. ఈ కేసులో మొత్తం 13 వందల 65 అఫిడవిట్‌లు దాఖలయ్యాయి.

సుదీర్ఘ విచారణ తర్వాత ఈ ఏడాది జనవరి మొదటివారంలో సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇచ్చింది జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్. ఆ నివేదికలో ఏముంది? సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి ప్రకటన చేయనుందనేది తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.