PM MODI: తెలంగాణలో మార్పు తథ్యం.. అధికారంలోకి వచ్చేది బీజేపీనే

తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు విసిగిపోయారు, మార్పు ఖాయమైంది, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని యాదవ్, త‌దిత‌రులు మోడీకి ఘన స్వాగ‌తం ప‌లికారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక నుండి ప్రధాని మోదీ భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు...

PM MODI: తెలంగాణలో మార్పు తథ్యం.. అధికారంలోకి వచ్చేది బీజేపీనే

Pm Modi (1)

PM MODI: తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు విసిగిపోయారు, మార్పు ఖాయమైంది, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని యాదవ్, త‌దిత‌రులు మోడీకి ఘన స్వాగ‌తం ప‌లికారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక నుండి ప్రధాని మోదీ భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తొలుత తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. సీఎం కేసీఆర్ టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పట్టుదల, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం, మీ ప్రేమాభిమానాలే నా బలం అంటూ మోదీ ప్రసంగించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చిందని, తెలంగాణ సౌభాగ్యం కోసం ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని, వాళ్లందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానంటూ మోదీ తెలిపారు.

PM Modi Hyderabad Visit : ముందే వచ్చిన మోదీ.. షెడ్యూల్ మారింది..!

హింసతో అధికారం సాధించాలని స్వాతంత్రానికి ముందు కూడా అనుకున్నారని, అప్పుడు విజయం సాధించలేదని, ఇప్పుడు సాధించలేరని అన్నారు. వాళ్లు తెలంగాణను రాజకీయ నేపథ్యంలో నడుపుదామనుకున్నారు.. మేం తెలంగాణను టెక్నాలజీ హబ్ గా మార్చాలనుకుంటున్నాం అంటూ సీఎం కేసీఆర్ లక్ష్యంగా మోదీ పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణను కొత్త శిఖరాలకు చేర్చడమే మా లక్ష్యమని, తెలంగాణ కోసం వందలమంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేసుకున్నారు. ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదని, తెలంగాణలో సామ, దాన, దండోపాయంతో ఒక కుటుంబం అధికారం చెలాయించడానికి ఉద్యమాలు జరగలేదని మోదీ అన్నారు. కుటుంబ పాలనను ప్రోత్సహించే వాళ్లు, ఆ పార్టీలే దేశానికి ద్రోహులు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఒక కుటుంబం అధికారంలోకి వస్తే ఎంత అవినీతిమయంగా ఉంటుందో తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, కుటుంబ పాలన తమ ఖజానా నింపుకుంటుందన్నారు. కుటుంబ పాలకులకు పేదల గురించి పట్టదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మోదీ పరోక్ష విమర్శలు చేశారు.

Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?

కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించడం ఈ శతాబ్దపు నినాదంగా పెట్టుకోవాలని మోదీ యువతకు సూచించారు. ఎక్కడైతే కుటుంబ పాలన అంతమైందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసే వాళ్లు నాడు, నేడు ఉన్నారన్నారు. మా పోరాటం ఫలితాన్ని ఇస్తోందని, తెలంగాణలో మార్పు తథ్యంమని, తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బడుగు, బలహీన, గిరిజనులు, మహిళలకు కేంద్ర ప్రభుత్వ పథకాలతో లాభం జరుగుతోందని, కానీ, ఇక్కడ పేర్లు మార్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని తెరాస ప్రభుత్వం తీరుపై మోదీ విమర్శలు గుప్పించారు. తెలంగాణ సామర్థ్యం ఏంటో మనకు తెలుసని, ఇక్కడి ప్రజల సత్తా ఏంటో తెలుసని, గతంలో జరిగిన కొన్ని ఎన్నికల ఫలితాలు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయని, తెలంగాణలో మార్పు ఖాయమని తేలిపోయిందని, తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమంటూ మోదీ అన్నారు.