Star Directors: ఒక్క ఫ్లాప్ పడితే డైరెక్టర్ల అడ్రస్ గల్లంతేనా..?

ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన లెజండరీ డైరెక్టర్లు, కలెక్షన్లతో తెలుగు సినిమా రికార్డుల మోత మోగించిన డైరెక్టర్లు, బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు కొట్టి నంబర్ వన్ డైరెక్టర్లుగా పేరు సంపాదించిన వాళ్లు ఒక్క ఫ్లాప్ తో ఇప్పుడు అడ్రస్ లేకుండాపోతున్నారు.

Star Directors: ఒక్క ఫ్లాప్ పడితే డైరెక్టర్ల అడ్రస్ గల్లంతేనా..?

Star Directors

Star Directors: ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన లెజండరీ డైరెక్టర్లు, కలెక్షన్లతో తెలుగు సినిమా రికార్డుల మోత మోగించిన డైరెక్టర్లు, బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు కొట్టి నంబర్ వన్ డైరెక్టర్లుగా పేరు సంపాదించిన వాళ్లు ఒక్క ఫ్లాప్ తో ఇప్పుడు అడ్రస్ లేకుండాపోతున్నారు.

Star Directors: డైరెక్టర్ల మెడ మీద కత్తి.. ఫ్లాపైతే చేతగాని తనమేనా?

సురేందర్ రెడ్డి… హీరో సెంట్రిక్ యాక్షన్ ని అదిరిపోయే లెవల్ లో చూపించే డైరెక్టర్. కిక్ తో రవితేజకు బ్లాక్ బస్టర్ ఇచ్చినా, రేసుగుర్రంతో అల్లు అర్జున్ ని అదిరిపోయే హిట్ ఇచ్చినా, ధృవతో రామ్ చరణ్ కెరీర్ ని స్పీడప్ చేసినా.. ఇదంతా సురేందర్ రెడ్డి టేకింగ్ వల్లనే. ఈ హీరోలకు కెరీర్ బ్లాక్ బస్టర్ లు ఇచ్చి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోవడంతో అంతే నెగెటివిటీని ఫేస్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఎన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినా ఒక్క ఫ్లాప్ ఈ డైరెక్టర్ గ్రాఫ్ ని మార్చేసింది.

Telugu Directors: పాన్ ఇండియా టార్గెట్.. ఈ దర్శకులకు ఇప్పుడిదే బిగ్ చాలెంజ్

అప్పటి వరకూ యంగ్ హీరోలతో సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి.. చిరంజీవి, అమితాబ్, విజయ్ సేతుపతి, సముద్రఖని నయనతార, తమన్నా లాంటి స్టార్ కాస్ట్ తో భారీ యాక్షన్ సీన్స్ తో పోరాట యోధుడి జీవితకథగా సైరా నర్సింహారెడ్డి సినిమా తీశారు. అయితే ఆడియన్స్ అంచనాల్ని అందుకోలేక అంతగా సక్సెస్ కాలేకపోయారు. అంత పెద్ద స్టార్ హీరోని హ్యాండిల్ చెయ్యడం రాలేదంటూ, ఎగ్జిక్యూషన్ సరిగా లేదంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. దాంతో అప్పటి వరకూ స్టార్ డైరెక్టర్ రేంజ్ లో ఉన్న సురేందర్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు అనౌన్స్ చేసిన సురేందర్ రెడ్డికి బ్రేక్ పడింది. అనౌన్స్ చేసిన స్టార్ సినిమాలు ఆగిపోయాయి.

New Directors: లక్కీ చాన్స్.. పెద్ద బ్యానర్లను పట్టేస్తున్న కొత్త దర్శకులు!

అప్పటి వరకూ కమర్షియల్ ఫార్ములాతో కంటిన్యూ అవుతున్న తెలుగు సినిమాకు కొత్త తరహా కథల్ని, మేకింగ్ ని పరిచయం చేసిన డైరెక్టర్ క్రిష్. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ లాంటి సమ్ థింగ్ డిఫరెంట్ స్టోరీస్ ని ప్రేక్షకులకు చూపించి మంచి సక్సెస్ అందుకున్నారు క్రిష్. అంతేకాదు.. బాలకృష్ణతో గౌతమి పుత్రశాతకర్ణి లాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ మూవీ చేసి స్టార్ డైరెక్టర్ లెవల్ కి రీచ్ అయ్యారు క్రిష్. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత ఒక్కసారిగా డౌన్ ఫాల్ స్టార్టయ్యింది క్రిష్ కి. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ లీడ్ రోల్ లో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాతో బాలయ్య బాబుని కొత్తగా చూపించే ఛాన్స్ దక్కించుకున్నారు క్రిష్.

New Directors: ఈ హీరోల్ని మెప్పించలేకపోతున్న కొత్త దర్శకులు.. లోపం ఎక్కడ?

రెండు పార్టులుగా ఉన్న ఈ బయోపిక్ లో ఫస్ట్ పార్ట్ కథానాయకుడిగా, మహానాయకుడిగా రిలీజ్ అయ్యింది. అయితే ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉండటంతో పాటు సినిమా ఆడియన్స్ కి ఎక్కడా కనెక్ట్ కాకపోవడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. క్రిష్ డైరెక్షన్ లోపం క్లియర్ గా ఉందని.. ఎమోషనల్ యాస్పెక్ట్స్ లేకుండా జస్ట్ గెటప్స్ మీద కాన్ సన్ ట్రేట్ చేశారని నందమూరి అభిమానులు అస్సలు ఆదరించలేదు. అంతేకాదు ఆతర్వాత వచ్చిన కొండపొలం కూడా సక్సెస్ కాకపోవడంతో క్రిష్ పని అయిపోయిందంటూ సినిమా ఫ్లాప్ లకి క్రిష్ నే పాయింట్ అవుట్ చేశారు.

Star Heroes: నాన్ స్టాప్ షెడ్యూల్స్.. స్టార్ హీరోల మూవీ లైనప్ అదుర్స్!

స్టార్ హీరోల దగ్గరనుంచి యంగ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరికీ బ్లాక్ బస్టర్ హిట్లిచ్చిన మాస్ యాక్షన్ డైరెక్టర్ వివి.వినాయక్.. ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, ఠాగూర్, అదుర్స్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్లిచ్చి టాప్ డైరెక్టర్ అయిన వినాయక్.. చిరంజీవి సెకండ్ ఇన్సింగ్స్ మూవీ ఖైదీ నెం.150తో తన మాస్ పవర్ ని మరోసారి ప్రూవ్ చేసుకుని మెగాస్టార్ కి మ్యాసివ్ హిట్ ఇచ్చారు. ఇన్ని బ్లాక్ బస్టర్లు ఇచ్చినా.. ఒక్క ఫ్లాప్ తో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. సాయిధరమ్ తేజ్ తో చేసిన ఇంటెలిజెంట్ మూవీతో అప్పటి వరకూ వినాయక్ ఎక్కిన సక్సస్ మెట్లన్నీ కూలిపోయాయి. వినాయక్ పని అయిపోయింది.. అదే యాక్షన్ ఎన్ని సార్లు చూస్తారు..? ఇక అప్ డేట్ అవ్వడా అసలు సినిమా ఫ్లాప్ అవ్వడానికి వినాయక్ టేకింగే రీజన్ అంటూ దుమ్మెత్తిపోశారు. దాంతో వినాయక్ కెరీర్ 5 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా పోయింది.