New Directors: లక్కీ చాన్స్.. పెద్ద బ్యానర్లను పట్టేస్తున్న కొత్త దర్శకులు!

కంటెంట్ ఉండాలి కానీ.. ఎంత పెద్ద బ్యానర్ అయినా ఛాన్స్ ఇస్తుందని ఫుల్ ఖుష్ అవుతున్నారు ఈ డైరెక్టర్లు. మొన్న మొన్నటి వరకూ అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేసిన డైరెక్టర్లకు దెబ్బకు సుడి తిరిగింది.

New Directors: లక్కీ చాన్స్.. పెద్ద బ్యానర్లను పట్టేస్తున్న కొత్త దర్శకులు!

New Directors

New Directors: కంటెంట్ ఉండాలి కానీ.. ఎంత పెద్ద బ్యానర్ అయినా ఛాన్స్ ఇస్తుందని ఫుల్ ఖుష్ అవుతున్నారు ఈ డైరెక్టర్లు. మొన్న మొన్నటి వరకూ అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేసిన డైరెక్టర్లకు దెబ్బకు సుడి తిరిగింది. అందుకే తంతే గారెల బుట్టలో పడ్డట్టు.. బిగ్ బ్యానర్ల బుట్టలో పడి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ కలల్ని నిజం చేసుకుంటున్నారు.

New Directors: ఈ హీరోల్ని మెప్పించలేకపోతున్న కొత్త దర్శకులు.. లోపం ఎక్కడ?

చిన్న హీరోలు, అప్ కమింగ్ హీరోలతో ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత సక్సెస్ కోసం ట్రై చేస్తున్నా.. కరెక్ట్ బ్యానర్ లో సినిమా పడితే ఆ గుర్తింపే వేరు. అందుకే ఈ మధ్య సక్సెస్ లో ఉన్న చిన్న డైరెక్టర్లకు లిప్ట్ ఇస్తున్నాయి స్టార్ ప్రొడక్షన్ హౌజ్ లు. లేటెస్ట్ గా నిఖిల్ తో కార్తికేయ లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ చందూ మొండేటికి మంచి ఆఫరిచ్చింది గీతా ఆర్ట్స్. తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కార్తికేయ2 కంప్లీట్ అయ్యాక త్వరలోనే సెట్స్ మీద కెళ్లబోతోందని అనౌన్స్ చేశారు చందుమొండేటి.

New Directors: కంటెంట్‌తో కొడుతున్న కొత్త దర్శకులు.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు!

మళ్లీ రావా, జెర్సీ లాంటి సినిమాలతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన గౌతమ్ తిన్ననూరికి టాప్ ప్రొడక్షన్ హౌజ్ యు.వి క్రియేషన్స్ చాన్సిచ్చింది. సాహో, రాధేశ్యామ్ లాంటి టాప్ మూవీస్ చేసిన యు.వి గౌతమ్ తో రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా చెయ్యబోతోంది. ఎమోషన్స్ తో కూడిన పవర్ ప్యాక్డ్ యాక్షన్ బేస్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

New Directors: ఏదో తడబాటు.. ఛాన్సిచ్చినా వాడుకోని డైరెక్టర్లు

పుష్ప లాంటి భారీ సక్సెస్ లు కొడుతూనే మరో వైపు అప్ కమింగ్ అండర్ రేటెడ్ డైరెక్టర్స్ కి ఛాన్సిస్తోంది మైత్రి మూవీ మేకర్స్. దిల్ రాజు బ్యానర్ లో అశ్వత్ మారిముత్తు అనేకొత్త డైరెక్టర్ కి ఛాన్సిచ్చింది. విష్వక్ సేన్ హీరోగా ఓరిదేవుడా అనే ఇంట్రస్టింగ్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు యంగ్ డైరెక్టర్ అశ్వత్.

Tollywood Directors: స్టార్స్‌తో సినిమాలు చేసినా.. పట్టాలెక్కని నెక్స్ట్ ప్రాజెక్ట్స్!

లేటెస్ట్ గా మెగా ప్రొడక్షన్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ కూడా మురళీ కిషోర్ అనే యంగ్ డైరెక్టర్ కి ఛాన్సిచ్చింది. సెబాస్టియన్, ఎస్.ఆర్ కళ్యాణ మండపం లాంటి డిఫరెంట్ మూవీస్ చేస్తున్న కిరణ్ అబ్బవరంతో.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మురళీ కిషోర్.