New Directors: ఈ హీరోల్ని మెప్పించలేకపోతున్న కొత్త దర్శకులు.. లోపం ఎక్కడ?

ఈ మధ్య స్టార్ హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త కొత్త డైరెక్టర్లతో, కొత్త జానర్లతో, అంతకంటే కొత్త స్టోరీలతో కొత్త కొత్తగా కనిపించడానికి తెగ ట్రై చేస్తున్నారు హీరోలు.

New Directors: ఈ హీరోల్ని మెప్పించలేకపోతున్న కొత్త దర్శకులు.. లోపం ఎక్కడ?

New Directors

New Directors: ఈ మధ్య స్టార్ హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త కొత్త డైరెక్టర్లతో, కొత్త జానర్లతో, అంతకంటే కొత్త స్టోరీలతో కొత్త కొత్తగా కనిపించడానికి తెగ ట్రై చేస్తున్నారు హీరోలు. డైరెక్టర్లు కూడా స్టార్లని ఇంప్రెస్ చెయ్యడానికి అంతకంటే కొత్తగా కథల్ని తయారు చేసుకుంటూ స్టార్ హీరోల్ని సైతం మెప్పిస్తున్నారు. కానీ కొత్త డైరెక్టర్లు ఎంత ఎగ్జైటింగ్ స్టోరీ చెప్పినా, ఎంత కొత్త జానర్ తో మెప్పించాలనుకున్నా ఈ హీరోలు మాత్రం అబ్బే బాలేదంటున్నారు.

New Directors: కంటెంట్‌తో కొడుతున్న కొత్త దర్శకులు.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు!

టాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ మారుతోంది. దాంతో మూవీ మేకింగ్ మారింది. దాంతో చిరంజీవి, చరణ్, ప్రభాస్ లాంటి స్టార్లు కూడా యంగ్ జనరేషన్ డైరెక్టర్లతో ప్రేక్షకుల ముందకు వస్తున్నారు. ప్రశాంత్ నీల్, వెంకీ కుడుముల, బాబీ, సందీప్ రెడ్డి, నాగాశ్విన్.. డైరెక్టర్లు సరికొత్త కథలతో స్టార్స్ ని మెప్పిస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ కొత్త డైరెక్టర్లతో కొత్త జానర్ల కొత్త కాంబినేషన్స్ తో సర్ ప్రైజ్ చేస్తున్నారు. కానీ ఎంత ఇంట్రస్టింగ్ కథచెప్పినా.. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల్ని మాత్రం మెప్పించలేకపోతున్నారు ఈ జనరేషన్ డైరెక్టర్లు.

New Directors: ఏదో తడబాటు.. ఛాన్సిచ్చినా వాడుకోని డైరెక్టర్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకూ సేఫ్ గానే కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ హీరోతో పాటు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా.. ఇప్పటి వరకూ ఆ రేంజ్ సినిమా రిలీజ్ చెయ్యలేదు మహేష్. అంతేకాదు.. కొత్త జానర్స్ లో సినిమా చెయ్యడానికి యంగ్ డైరెక్టర్లు ఎలాంటి కథ చెప్పినా మహేష్ మాత్రం ఇంప్రెస్ కావడం లేదు. అంతే కాదు.. సేఫ్ డైరెక్టర్లతోనే.. పరశురామ్, త్రివిక్రమ్, రాజమౌళి.. ఇలా ఆళ్రెడీ ఓ రేంజ్ ఉన్న డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లు ఎన్ని కొత్త కథలు చెప్పినా.. కొత్త జానర్ ట్రై చెయ్యడానికి ఇష్టపడడం లేదు మహేష్.

Tollywood Directors: స్టార్స్‌తో సినిమాలు చేసినా.. పట్టాలెక్కని నెక్స్ట్ ప్రాజెక్ట్స్!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా కొత్త డైరెక్టర్ల కథలకి ఇంప్రెస్ అవ్వడం లేదు. జానర్ మార్చి ఎందుకు రిస్క్ చెయ్యడం అనుకుంటున్నారు. అందుకే అలవాటైన రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్లు ఎలాంటి కథలు చెప్పినా.. ససేమిరా అంటున్నారు ఎన్టీఆర్.

Tamil Directors: పెద్ద సినిమాల్ని హ్యాండిల్ చెయ్యలేకపోతున్న యంగ్ డైరెక్టర్లు

అల్లు అర్జున్ ని కూడా తమ కథలతో ఇంప్రెస్ చెయ్యలేకపోతున్నారు యంగ్ జనరేషన్ డైరెక్టర్లు. మారుతి, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్.. ఇలాంటి డైరెక్టర్లు ఎంత మంది కొత్త కథలు చెప్పినా బన్నీని ఏమాత్రం ఎంగేజ్ చెయ్యలేకపోతున్నారు. అందుకే బన్నీ కూడా సేఫ్ గా సుకుమార్, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్లకే మళ్లీ మళ్లీ చాన్సిస్తున్నారు. ఇలా కొత్త డైరెక్టర్లు ఎంత మంది వచ్చినా.. కొత్త జానర్స్ ఎన్ని చెప్పినా.. ఈ హీరోల్నిఇంప్రెస్ చెయ్యలేకపోతున్నారు.