Star Heroes: నాన్ స్టాప్ షెడ్యూల్స్.. స్టార్ హీరోల మూవీ లైనప్ అదుర్స్!

కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీలో యాక్టివిటీస్ స్లో అయ్యాయేమో కానీ.. స్టార్లు మాత్రం ఫుల్ స్పీడ్ పెంచేశారు. ఆపసోపాలు పడుతూ సంవత్సరానికి ఒక్క సినిమా చేసే హీరోలు ఇప్పుడు వరస పెట్టి..

Star Heroes: నాన్ స్టాప్ షెడ్యూల్స్.. స్టార్ హీరోల మూవీ లైనప్ అదుర్స్!

Tollywood Heroes

Star Heroes: కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీలో యాక్టివిటీస్ స్లో అయ్యాయేమో కానీ.. స్టార్లు మాత్రం ఫుల్ స్పీడ్ పెంచేశారు. ఆపసోపాలు పడుతూ సంవత్సరానికి ఒక్క సినిమా చేసే హీరోలు ఇప్పుడు వరస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఏదో చిన్న హీరోలు కాదు.. స్టార్ హీరోలే ఏకంగా 4,5 సినిమాలతో నాన్ స్టాప్ వర్క్ చేస్తూ ఎంగేజ్ అయిపోతున్నారు. మారుతితో సినిమా మొదలుపెట్టబోతున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందంటున్న చరణ్.. ఇలా వరస పెట్టి స్టార్ హీరోలు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో లైనప్ సెట్ చేసేసుకున్నారు. అసలు ఒక్కోహీరోకి ఎన్ని సినిమాలున్నాయో, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయో డీటెయిల్డ్ గా చూద్దాం.

Tollywood Celebrations: ఇట్స్ పార్టీ టైమ్.. సెలబ్రేషన్ మూడ్‌లో టాలీవుడ్!

టాలీవుడ్ హీరోలు స్పీడప్ అయ్యారు. సంవత్సరానికి ఒక్క సినిమా కాదు.. ఒకేసారి 4,5 సినిమాలతో బిజీగా ఉంటున్నారు. 2,3 ఏళ్లకోసారి సినిమాలు చేసే ప్రభాస్.. వరసగా 5 సినిమాల్ని లైనప్ చేసేసుకున్నారు. ఇప్పటికే ఆదిపురుష్, సలార్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్.. నాగాశ్విన్ డైరెక్షన్లో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, ప్రభాస్ లీడ్ రో ల్స్ ప్లే చేస్తున్న ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ కూడా చేస్తున్నారు. ఈ మూడు సినిమాలతో పాటు సందీప్ రెడ్డితో స్పిరిట్ మూవీ, మారుతితో మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు.

Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

ఎప్పుడూ ఒక సినిమా కంప్లీట్ అయ్యాక గానీ వేరే సినిమా గురించి ఊసెత్తని మహేష్ బాబు లైనప్ కూడా గట్టిగానే ఉంది. ప్రజెంట్ పరశురామ్ తో సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ చేస్తూనే.. నెక్ట్స్ మన్త్ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత ఆల్రెడీ అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అవ్వగానే రాజమౌళితో భారీ మూవీ సెట్స్ మీదకెళ్లబోతోంది. ఈ మూడు సినిమాల తర్వాత తనకు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివతో హ్యాట్రిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారు.

Tollywood Directors: స్టార్స్‌తో సినిమాలు చేసినా.. పట్టాలెక్కని నెక్స్ట్ ప్రాజెక్ట్స్!

క్లాస్, మాస్ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ కూడా ఈ సారి వరసగా సినిమాలు అనౌన్స్ చేసేశారు. 4 ఏళ్ల నుంచి ట్రిపుల్ఆర్ సినిమాతోనే కంటిన్యూ అయిన ఎన్టీఆర్.. కొరటాలశివతో కొత్త సినిమా స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఈ సినిమా తర్వాత ప్రజెంట్ సెన్సేషన్ ప్రశాంత్ నీల్ తో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ మీదకెళ్లబోతోంది. ప్రశాంత్ తో సినిమా కంప్లీట్ అయ్యాక గానీ త్రివిక్రమ్ సినిమా పట్టలెక్కే పరిస్తితి లేదు. ఈ మూడు సినిమాలు అయ్యాకే బుచ్చిబాబుతో సినిమా స్టార్ట్ చేస్తారు ఎన్టీఆర్. ఇలా 4 సినిమాలతో ఎంగేజ్ అయ్యారు ఎన్టీఆర్.

Tollywood Senior Heroes: ఏజ్ సిక్స్ టీ ప్లస్.. కానీ కుర్ర హీరోలతోనే పోటీ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 4 సినిమాల లైనప్ తో ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్లో చిరంజీవితో ఆచార్య మూవీలో సిద్దగా రిలీజ్ కి రెడీ అవుతూనే.. స్టార్ డైరెక్టర్ శంకర్ తో పొలిటికల్ డ్రామాని స్టార్ట్ చేసి ఆ సినిమాని కూడా స్పీడప్ చేస్తున్నారు. ఈ రెండిటితో పాటు గౌతమ్ తిన్ననూరితో సినిమా అనౌన్స్ చేసి.. సుకుమార్ తో మరో సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

Tollywood Movies: కుర్ర హీరోలకి కలిసొస్తున్న పెళ్లి కాన్సెప్ట్!

పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న అల్లు అర్జున్.. పుష్ప 2ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో పాటు దిల్ రాజు, వేణుశ్రీరామ్ కాంబినేషన్లో ఐకాన్ మూవీని ఇంకా హోల్డ్ లోనే పెట్టిన బన్నీ.. ఈ సినిమాల తర్వాత బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఓ ప్రాజెక్ట్ ని లైనప్ చేస్తున్నారు.

Tollywood Stars: హీరోయిన్ల కొరత.. సినిమాలున్నా స్టార్ హీరోల వెయిటింగ్!

యంగ్ సెన్సేషన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈమధ్య వరస లైనప్ చేసేశాడు. పూరీ జగన్నాధ్ తో లైగర్ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్.. శివనిర్వాణతో ఎప్పుడో అనుకున్న ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ప్యార్లల్ గానే పూరీతో అనౌన్స్ చేసిన జనగణమనని మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఫాల్కన్ ప్రొడక్షన్స్ తో సుకుమార్ డైరెక్షన్లో అనౌన్స్ చేసిన సినిమా కూడా లైనప్ లో యాడ్ అయ్యే ఉంది విజయ్ కి.

Tollywood Meeting: ఉసూరుమనిపించిన ఇండస్ట్రీ మీటింగ్.. కారణాలేంటి?

వరస సినిమాలతో బిజీగా ఉన్న మరో హీరో నాని.. లుక్ వైజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా మేనేజ్ చేస్తున్న నాని.. సినిమాలతో షటిల్ సర్వీస్ చేస్తున్నారు. వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికి మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న నాని, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో కీర్తిసురేష్ హీరోయిన్ గా దసరా మూవీని ట్రాక్ ఎక్కించి లైనప్ తో బిజీగా ఉన్నారు.