Tollywood Meeting: ఉసూరుమనిపించిన ఇండస్ట్రీ మీటింగ్.. కారణాలేంటి?

ఆదివారం టాలీవుడ్ ఏర్పాటు చేసిన మీటింగ్ ఉడికించి ఉడికించి ఉసూరుమనిపించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్ని క్రాఫ్ట్స్ కి సంబంధించిన మీటింగ్ కి 24 క్రాఫ్ట్స్..

Tollywood Meeting: ఉసూరుమనిపించిన ఇండస్ట్రీ మీటింగ్.. కారణాలేంటి?

Tollywood Meeting

Tollywood Meeting: ఆదివారం టాలీవుడ్ ఏర్పాటు చేసిన మీటింగ్ ఉడికించి ఉడికించి ఉసూరుమనిపించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్ని క్రాఫ్ట్స్ కి సంబంధించిన మీటింగ్ కి 24 క్రాఫ్ట్స్ నుంచి 240 మందికి ఆహ్వానం పంపినా వంద మంది లోపే హాజ‌ర‌య్యారు. సినీ పరిశ్ర‌మ‌లో స‌మ‌స్య‌ల గురించి చర్చిస్తారు అని వార్తలు వచ్చినా అవేమి జరగలేదని తెలుస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఒకరిద్దరు తప్ప మిగతా బడా హీరోలు, చెప్పుకోదగ్గ దర్శక నిర్మాతలు ఎవరూ ఈ మీటింగ్ కి కనీసం హాజరు కూడా కాలేదు.

Tollywood : ముగిసిన టాలీవుడ్ కీలక సమావేశం..

ఏపీ సీఎం జగన్ తో మెగా మీటింగ్ తర్వాత జరిగిన మీటింగ్.. అది కూడా జగన్ తో మీటింగ్ కి ముందే జరగాల్సిన మీటింగ్ వాయిదా పడి ఇప్పుడు జరిగిన మీటింగ్ కావడం.. మెగా మీటింగ్ తర్వాత మంచు కుటుంబం నుండి మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు పర్సనల్ గా సీఎం జగన్ తో కలవడం వంటి హాట్ టాపిక్స్ తో సహజంగానే మూవీ లవర్స్ తో పాటు మీడియా ఈ మీటింగ్ కి భారీ హైప్ ఇచ్చింది. కానీ.. అవేమీ లేకుండా.. ఏదో తూతూ మంత్రంగా.. మొక్కుబడిగా మాత్రమే ఈ మీటింగ్ జరిగింది.

Tollywood : సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వంతో.. వర్మ, చిరు, పవన్.. ఎవరు కరెక్ట్?

తమ్మారెడ్డి భరద్వాజ, ప్రసన్న కుమార్, సి. కళ్యాణ్, నట్టి కుమార్ తదితరుల సమక్షంలో జరిగిన ఈ మీటింగ్ కి దర్శకుల తరుపున రాజమౌళి హాజరయ్యారు. స్టార్ హీరోలెవరూ ఈ మీటింగ్ లో లేరు. ఏదో తూతూ మంత్రంగా జరిగింది. మీటింగ్ కి ముందే ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్.. కరోనా తర్వాత నిర్మాతలు, దర్శకులు ఎదుర్కొనే ఇబ్బందులపైనే ఈ సమావేశమనట్లు తెలిపగా.. మీటింగ్ అనంతరం.. నిర్మాతల మండలికి సంబంధించిన ప్ర‌స‌న్న కుమార్‌.. నిర్మాత‌ల మ‌ధ్య ఉన్న అంత‌ర్గ‌త ఇబ్బందులు, స‌మ‌స్య‌ల గురించే చర్చించాం.. అందుకే ఈ మీటింగ్ అని తేల్చేశారు.

Tollywood : జగన్ తో మీటింగ్ కి పోసాని, అలీ ఎందుకు వెళ్లారు??

నిజానికి అందరూ అనుకున్నట్లే ఇది ఇండస్ట్రీలో అన్ని శాఖలకు సంబంధించినదిగా మొదలవగా.. చివరికి ఇది కేవలం రెండు శాఖల మీటింగ్ గా ముగిసింది. ఈ మీటింగ్ ఇలా ప్లాప్ అవ్వడానికి అసలు కారణాలేంటి? అన్నది ఎవరికీ తెలియదు. మొన్న సీఎంతో మెగా మీటింగ్ తర్వాత చిరంజీవి అలా జగన్ ముందు చేతులు జోడించడం చాలా మందికి నచ్చలేదు. కొందరు బహిరంగంగానే దీనిపై కామెంట్స్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి కూడా ఈ సమస్యల విషయంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకోవడం వలనే ఈ మీటింగ్ ఇలా అట్టర్ ప్లాప్ అయిందన్నది ఇన్నర్ టాక్. అయితే.. రాజమౌళి హాజరవడం ఆసక్తికరం.