Oscars 2022: అంచనాల్ని తలకిందులు చేసిన ఆస్కార్ అవార్డులు!
ఎన్ని అవార్డులు ఇంట్లో ఉన్నా ఒక్క ఆస్కార్ అవార్డ్ కు సాటిరాదు. అందుకే ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఆస్కార్ అవార్డ్స్ అంటే అంత క్రేజ్ సినిమా ఇండస్ట్రీలో.

Oscars 2022
Oscars 2022: ఎన్ని అవార్డులు ఇంట్లో ఉన్నా ఒక్క ఆస్కార్ అవార్డ్ కు సాటిరాదు. అందుకే ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఆస్కార్ అవార్డ్స్ అంటే అంత క్రేజ్ సినిమా ఇండస్ట్రీలో. 2022 సంవత్సరానికి సంబంధించి తాజాగా 94వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక జరిగింది. 2021లో ఎటువంటి హడావిడి, హంగామా, ప్రేక్షకులు కూడా లేకుండా కోవిడ్ వల్ల ఆస్కార్ వేడుక రెండు వేదికల మీద జరిగింది. కానీ ఈ సారి స్టార్లు, సెలబ్రిటీల మధ్య లాస్ ఏంజెల్స్ లో ఫుల్ జోష్ లో సోమవారం జరిగింది ఆస్కార్ అవార్డుల సెర్మనీ.
Oscars: ఆస్కార్ నామినేషన్స్ ఇవే.. భారత్ నుంచి ఒకే ఒక్క డాక్యుమెంటరీ!
ఆస్కార్ పోటీల్లో ‘డ్యూన్’, ‘చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్సినిమాలు సత్తా చాటాయి. డ్యూన్ సినిమాకి సౌండ్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, ఒరిజినల్ స్కోర్‌లో అవార్డులు వచ్చాయి. అంతేకాదు.. సినిమాటోగ్రఫీ విభాగంలో కూడా డ్యూన్ సినిమాకే ఆస్కార్ వరించింది. ఇక బెస్ట్ మూవీ ఇంటర్నేషనల్ మూవీగా జపాన్ చెందిన డ్రైవ్ మై కార్ నిలిచింది. బెస్ట్ యాక్టర్ గా కింగ్ రిచర్డ్ మూవీకి సంబంధించి హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కి ఆస్కార్ దక్కింది. ఉత్తమ నటిగా ద ఐస్ ఆఫ్ టామీఫే సినిమాకి.. జెస్సికా చస్టేన్ ఆస్కార్ అందుకున్నారు. ది పవర్ ఆఫ్ ది డాగ్ మూవీకి సంబంధించి బెస్ట్ డైరెక్టర్ గా జానే కాంపీయన్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా కోడా మూవీకి సంబంధించి.. ట్రాయ్ కోట్సుర్‌కు ఆస్కార్ వచ్చింది.
94th Oscars : అకాడమీ అవార్డ్స్‌కు ఆహ్వానం..
ఉత్తమ సహాయ నటిగా వెస్ట్ సైడ్ స్టోరీకి సంబంధించి అరియానా డీబ్రోస్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ క్యాటగిరీలో సమ్మర్ ఆఫ్ సోల్ ఆస్కార్ అవార్డు గెలుచుంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విషయంలో మనకు ఎంతో కొంత ఆశ కలిగించిన భారతీయ సినిమా ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ ని గెలుచుకోలేకపోగా.. ఈ అవార్డును సమ్మర్ ఆఫ్ సోల్ సొంతం చేసుకుంది.