Drunken Rooster: మ‌ందు లేనిదే ముద్ద ముట్ట‌దు.. కోడిపుంజు విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌..!

మ‌హారాష్ట్ర భందారా జిల్లాలోని ఓ కోడిపుంజు రాజ‌భోగాన్ని అనుభ‌విస్తుంది. ఆ కోడి పుంజుకు ప్ర‌తిరోజూ మందు ఉండాల్సిందే. మందు లేనిదే ముద్ద‌కూడా ముట్ట‌డు.. క‌నీసం మంచినీళ్లు కూడా తాగ‌దు..

Drunken Rooster: మ‌ందు లేనిదే ముద్ద ముట్ట‌దు.. కోడిపుంజు విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌..!

Rooster

Drunken Rooster: మ‌హారాష్ట్ర భందారా జిల్లాలోని ఓ కోడిపుంజు రాజ‌భోగాన్ని అనుభ‌విస్తుంది. ఆ కోడి పుంజుకు ప్ర‌తిరోజూ మందు ఉండాల్సిందే. మందు లేనిదే ముద్ద‌కూడా ముట్ట‌డు.. క‌నీసం మంచినీళ్లు కూడా తాగ‌దు. ప్రాణ‌మైనా పోగొట్టుకునేందుకు సిద్ధ‌మ‌వుతుంది.. కానీ మందు లేకుంటే బ‌త‌క‌లేదు. ఇలాంటి అరుదైన ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన వారు మ‌నుషుల్లో క‌నిపిస్తారు. కానీ కోడిపుంజు సైతం నేను మ‌నిషికంటే ఏం త‌క్కువ తిన్నానా అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తోంది. ఇంట్లో కోడిపుంజులా పెంచుకుంటున్న యాజ‌మాని చేసేది లేక దానిని బ‌తికించుకొనేందుకు రోజూ మ‌ద్యం తెచ్చి పోస్తున్నాడు.

Rooster Death : నా కోడిని చంపేసారు.. పోస్ట్ మార్టం చేయండి.. మాజీ ఎమ్మెల్యే కొడుకు డిమాండ్

భందారా న‌గ‌రానికి స‌మీపంలోని పున‌రావాస గ్రామం పిప్రీకి చెందిన భావుకాతోరే అనే వ్య‌క్తికి కోళ్ల పెంప‌కంపై ఆస‌క్తి ఎక్కువ‌. ప‌లు ర‌కాల కోళ్ల‌ను పెంచుతుంటాడు. అయితే ఓ కోడిపుంజు మాత్రం ఇంట్లో మ‌నిషిలాగానే ఉంటుంది. భావుకాతోరే సైతం ఆ కోడిపుంజుకు ఇంట్లోని మ‌నుషుల వ‌లే ఇష్ట‌మైన ఆహారాన్ని అందిస్తాడు. అయితే ఓ రోజు కోడి పుంజు అనారోగ్యానికి గురైంది. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంగా బాధ‌ప‌డుతున్న కోడిపుంజుకు స్థానికంగా ఉండే ఓ వ్య‌క్తి సూచ‌న మేర‌కు మ‌ద్యంను ప‌ట్టించాడు. కొద్దిరోజుల‌కే కోడిపుంజు కోలుకొని మ‌ళ్లీ య‌థావిధిగా తిర‌గ‌డం మొద‌లు పెట్టింది.

Chicken Price: వేసవి ఎఫెక్ట్.. మాంసాహార ప్రియులకు షాక్..

అయితే అస‌లు విష‌యం ఇక్క‌డే మొద‌లైంది. ఆ కోడిపుంజు యాజ‌మానికి దిమ్మ‌తిరిగే షాకిచ్చింది. ఓ రోజు కోడి పుంజుకు ఆహారాన్ని అందించాడు. అయితే అది ముట్టుకోలేదు. రోజంతా అలానే ఉంది. మంచినీరు పెట్టినా తాగ‌లేదు. దీంతో మ‌రుస‌టి రోజు కోడిపుంజుకు మ‌ద్యాన్ని అందించే స‌రికి గ‌ట‌గ‌టా తాగేసి వెంట‌నే ఆహారాన్ని తీసుకుంది. ఖంగుతిన్న యాజ‌మాని.. మ‌ద్యానికి బానిసైంద‌ని గుర్తించాడు. కోడిపుంజుకోసమ‌ని ప్ర‌త్యేకంగా మందు తెప్పించి ప్ర‌తిరోజూ కొంచెం పోసి దానికి ఆహారం అందిస్తున్నాడు. ఈ విచిత్ర ఘ‌ట‌న చూసేందుకు స్థానికులు క్యూ క‌డుతున్నారు. అయితే కోడి పుంజుకు కేవ‌లం మ‌ద్యం అందించేందుకు యాజ‌మానికి నెల‌కు రూ.2వేలు ఖ‌ర్చు అవుతుంది. ఖ‌ర్చు భ‌రించ‌లేని భావుకాతోరే ప‌శువైద్యాధికారిని సంప్ర‌దించాడు. అయితే ఆల్కహాల్​లా వాసన వచ్చే విటమిన్​ ట్యాబ్లెట్లు ఇవ్వటం ప్రారంభించాలని సూచించారు.