Dandruff : శీతాకాలంలో చుండ్రు సమస్యకు పరిష్కారం…

క‌ల‌బంద గుజ్జును జుట్టుకు బాగా రాసి 1 గంట‌ల సేప‌య్యాక త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు స‌మ‌స్య‌తోపాటు ఇత‌ర శిరోజాల స‌మ‌స్య‌లూ త‌గ్గుతాయి.

Dandruff : శీతాకాలంలో చుండ్రు సమస్యకు పరిష్కారం…

Dandruff (1)

Dandruff : ఇటీవలి కాలంలో చుండ్రు సమస్య చాలా మందిని బాధిస్తుంది. దీన్ని వదలగొట్టుకొనేందుకు వాడని షాంపూ ఉండదు. అయనప్పటికీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఈ చుండ్రు వల్ల కళ్ల దురదలు కూడ వేధిస్తాయి. చండ్రు ఎక్కువైతే.. క్రమేనా చర్మ సమస్యలు కూడా వస్తాయి. తలపై చుండ్రు ఎక్కువైతే స్థైర్యం దెబ్బతింటుంది. చికాకు పెరుగుతుంది. బయటకు వెళ్లాలంటేనే భయం కలుగుతుంది. నలుగురితో కలిసి తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. చుండ్రు కొందరిలో ఏకాగ్రత దెబ్బతీస్తుంది. సాధార‌ణంగా చుండ్రు స‌మ‌స్య చాలా మందిని బాధిస్తుంటుంది.

చుండ్రు రావటానికి కారణం మన తలలో ఉండే ఈస్టు అనే హానిలేని సూక్ష్మజీవి. ఇది అందరిలో ఉంటుంది. కానీ తలలో అధికంగా ఉండే నూనె, మృత కణాలని ఆహారంగా తీసుకుని వృద్ధి చెందుతుంది. దీనిమూలంగా మృత కణాలు ఎక్కువై తల నిండా పొట్టు లాగా కనపడుతుంది. దీనినే చుండ్రు అంటారు.అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చుండ్రును శాశ్వ‌తంగా వదిలించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..

కొద్దిగా వెనిగ‌ర్ తీసుకుని దాన్ని నీళ్ల‌లో క‌లిపి జుట్టుకు ప‌ట్టేలా రాయాలి. 30 నిమిషాల పాటు ఉండి త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల చుండ్రు త‌గ్గుతుంది. ముఖ్యంగా దుర‌ద‌తో కూడిన చుండ్రు స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. ఈ విధంగా వారంలో క‌నీసం 3 సార్లు చేయాలి. రాత్రి మెంతుల్ని నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే రుబ్బండి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు పట్టించండి. ఓ గంటసేపు ఆగి షాంపూతో తలంటుకోండి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమే కాకుండా మాడు కూడా చల్లబడుతుంది.

కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని నీటితో క‌లిపి దాన్ని జుట్టుకు ప‌ట్టించాలి. 30 నిమిషాలు ఆగాక త‌ల‌స్నానం చేయాలి. బేకింగ్ సోడాలో యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల బాక్టీరియా న‌శిస్తుంది. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు త‌గ్గుతుంది.

కొన్ని వేపాకుల‌ను తీసుకుని పేస్ట్‌లా చేసి జుట్టుకు ప‌ట్టించాలి. 1 గంట సేపు ఉన్నాక త‌ల‌స్నానం చేయాలి. వేపాకుల్లోనూ యాంటీ ఫంగ‌ల్, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయ‌. దీని వ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. త‌లంతా శుభ్రంగా మారుతుంది. చుండ్రు పోతుంది.

వేప నూనె, ఆలివ్ ఆయిల్‌ను సమాన మోతాదులో కలిపి వేడి చేయండి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఆ మిశ్రమాన్ని వెంటుకలకు, మాడుకు రాసుకోండి. పావుగంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి. మీరు వాడే సాధార‌ణ షాంపూలో కొన్ని చుక్క‌ల టీ ట్రీ ఆయిల్‌ను క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మంతో త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా త‌ర‌చూ చేస్తుంటే చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు.

క‌ల‌బంద గుజ్జును జుట్టుకు బాగా రాసి 1 గంట‌ల సేప‌య్యాక త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు స‌మ‌స్య‌తోపాటు ఇత‌ర శిరోజాల స‌మ‌స్య‌లూ త‌గ్గుతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా మార‌డ‌మే కాక బాగా పొడ‌వుగా పెరుగుతుంది. చిన్న అల్లం ముక్కను సన్నని ముక్కలుగా తరిగి నువ్వల నూనెలో వేయండి. ఆ నూనెతో తలకు మర్దనా చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు తలకు రాసుకొని ఉదయానే షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.

ఇతరుల దువ్వెనలను, బ్రెష్‌లను, తువ్వాళ్ళను వాడకూడదు. తమ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. వారానికి ఒకసారి పరిశుద్ధమైన కొబ్బరినూనెను కానీ, ఆలివ్ నూనెను కానీ వెచ్చ చేసి, తలకు పట్టించి, సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయలు, శీకాయపొడిని ఉపయోగించి, తలస్నానం చేయాలి.

గసగసాలు కొద్దిగా తీసుకొని, సన్నని మంట పై వేయించి, కొద్దిగా గోరువెచ్చటి నీటి లో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని,తలకు పట్టించి, 1 గంట ఆగి తల స్నానం చేయాలి. వస కొమ్ము పొడి :కొద్దిగా వస కొమ్ము పొడిని తీసుకొని, దానికి నీటిని కలిపి జుత్తు కుదుళ్ళకు పట్టించాలి. దీని వల్ల కొద్దిగ మంటగా ఉండవచ్చు.10 నుండి 15 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే చుండ్రు నివారించబడుతుంది.

పెరుగు, ఉసిరికాయ పొడి:చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మందార ఆకులు జుట్టుకు కండిషనర్ గా పనిచేస్తాయి. మందార ఆకులు, పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి, చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.