Struggle For Son : కొడుకు కోసం ఇద్దరు తల్లుల పోరాటం

రంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువుకు చెందిన రాజేష్, రమణమ్మలకు సంతానం లేదు. 14 ఏళ్ల క్రితం 2 నెలల బాబును శారద అనే మహిళ దగ్గర నుండి రాజేష్ రమణమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు.

Struggle For Son : కొడుకు కోసం ఇద్దరు తల్లుల పోరాటం

Son

struggle for son : కొడుకు కోసం ఇద్దరు తల్లులు పోరాటం చేస్తోన్నారు. నా బిడ్డ నాకే కావాలంటూ కన్నతల్లి, పెంచిన తల్లి ఆరాట పడుతున్నారు. పెంచిన తల్లి మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. 14 ఏళ్ల క్రితం శారదా అనే మహిళ నుంచి రెండు నెలల బాబుని రాజేష్-రమణమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. గ్రామ పెద్ద సమక్షంలో దత్తత ఒప్పందం జరిగింది. అయితే 14 ఏళ్ల తర్వాత తన బిడ్డ తనకే కావాలని కన్నతల్లి శారదా అంటోంది.

కానీ, కొడుకును ఇచ్చేందుకు పెంచిన తల్లి ససేమిరా అంటున్నారు. దీంతో కన్నతల్లి శారదా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడు అఖిల్ ను చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తీసుకెళ్లారు. అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని రమణమ్మ దంపతులు అంటున్నారు. కష్టపడి పెంచుకున్న కొడుకుని ఇప్పుడు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. న్యాయం చేయాలని పెంచిన తల్లిదండ్రులు కోరుతున్నారు.

Identification for ‘Mother Name’ : గుర్తింపు కార్డుల్లో ‘అమ్మ పేరు’ కోసం పోరాడి సాధించిన యువకుడు

రంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువుకు చెందిన రాజేష్, రమణమ్మలకు సంతానం లేదు. 14 ఏళ్ల క్రితం 2 నెలల బాబును శారద అనే మహిళ దగ్గర నుండి రాజేష్ రమణమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. శారదా.. కొండల్ రావు అనే వ్యక్తితో సహజీవనం సాగించి మగ బిడ్డకు జన్మించింది. మగ బిడ్డను గ్రామ పెద్దల సమక్షంలో రాజేష్, రమణమ్మ దంపతులకు దత్తత ఇచ్చారు. ఆ తర్వాత శారదాకు కొండల్ రావుతో వివాహం జరిగింది. వివాహం తర్వాత పిల్లలు కలగకపోవడంతో దత్తత ఇచ్చిన బాబును తిరిగి ఇవ్వాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చైల్డ్ వెల్ఫేయిర్ అధికారులు రంగంలోకి దిగారు. శారదా రాజకీయ నాయకుల ఇంట్లో పని చేయడం వలన ఒత్తిడి తెస్తుందని రాజేష్, రమణమ్మ దంపతుల ఆరోపిస్తున్నారు. 14 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకును ఇప్పుడు వచ్చి ఇవ్వాలి అనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయాలని రాజేష్ రమణమ్మ దంపతులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.