High Court : ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ గ్రామాల్లోని భూముల వేలం ప్రక్రియను అడ్డుకోవాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

High Court : ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

High Court (3)

sale of government lands : ప్రభుత్వ భూముల విక్రయానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. సర్కారు భూముల అమ్మకాలను తప్పుబట్టలేమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే టెండర్లు, ఈ-వేలం వంటి పారదర్శక విధానాలను పాటిస్తూ భూముల విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. తన ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ గ్రామాల్లోని భూముల వేలం ప్రక్రియను అడ్డుకోవాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కోకాపేటలో 49.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.91 ఎకరాల భూముల వేలాన్ని నిలిపివేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టి వేసింది. భూముల వేలం ప్రక్రియకు టెండర్లు, ఈవేలం వంటి విధానాలను అమలుచేయడం ద్వారా ప్రభుత్వం పారదర్శకత పాటించాలని షరతులు విధించింది.

TS High Court: మంచిరేవులలో ఆ 142 ఎకరాల భూమి ప్రభుత్వానిదే: పదేళ్ల తరువాత హైకోర్ట్ తీర్పు

ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. గతంలో విచారణ చేసిన హైకోర్టు, భూముల వేలం ప్రక్రియ కొనసాగింపునకు అనుమతి ఇస్తూనే తమ అనుమతి లేకుండా ఏవిధమైన విక్రయాలు నిర్వహించరాదని ఆదేశించింది. పిల్‌ను డిస్మిస్‌ చేయడం, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో భూముల విక్రయాలకు అడ్డంకులు తొలగిపోయాయి.