PM Modi : దేశాల కలయిక ప్రపంచానికి మేలు కలిగించే పరిణామం : ప్రధాని మోడీ

శ్వేతసౌధంలో 'క్వాడ్'​ దేశాధినేతల సదస్సు దాదాపు 4 గంటలపాటు సాగింది. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు ఐకమత్యంగా కృషి చేయాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది.

PM Modi : దేశాల కలయిక ప్రపంచానికి మేలు కలిగించే పరిణామం : ప్రధాని మోడీ

Modi (5)

‘Quad’ Heads of State Conference : శ్వేతసౌధంలో ‘క్వాడ్’​ దేశాధినేతల సదస్సు దాదాపు 4 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు ఐకమత్యంగా కృషి చేయాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది. వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధి వంటి అంశాలపై దేశాధినేతలు ప్రధానంగా చర్చించారు. ప్రపంచ దేశాలకు మేలు చేసే ఓ శక్తిగా క్వాడ్ కూటమిని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు.

2004లో వచ్చిన సునామీ తర్వాత మన నాలుగు దేశాలు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇప్పుడు కరోనా సంక్షోభంలో మళ్లీ భేటీ అయ్యామని, ప్రపంచ శ్రేయస్సుకోసమే ఈ సమావేశమయ్యామన్నారు ప్రధాని మోదీ. క్వాడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఇండో-పసిఫిక్ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

Corona : థర్డ్ వేవ్ వచ్చినా తీవ్రత తక్కువగానే ఉండే అవకాశం

మన ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్ మరింత ముందుకు వెళ్లాలని, సప్లై చైన్, ప్రపంచ భద్రత, వాతావరణ మార్పులు, కొవిడ్‌పై యుద్ధం సహా పలు అంశాలపై మాట్లాడటం ఆనందంగా ఉందని ప్రకటించారు ప్రధాని మోదీ.

ఇకపోతే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగా సమావేశంలో పాల్గొన్నారు. క్వాడ్ సదస్సు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ.. న్యూయార్క్ పయనమయ్యారు. ఐక్య రాజ్య సమతి 76వ జనరల్ అసెంబ్లీలో పాల్గొననున్నారు.