Nandini vs Milma: కర్ణాటకలో కొనసాగుతున్న పాల రాజకీయం.. అమూల్‌పై గెలిచి మిల్మా ముందు తలొగ్గిన నందిని
నందిని ఈ సంవత్సరం కొచ్చిలోని మామల్లపురంలో తన పార్లర్‌లను ప్రారంభించింది. సమీప భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక కేరళలో నందిని ఉనికిని కేరళ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సైతం వ్యతిరేకించింది

Nandini vs Milma: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు నందిని వర్సెస్ అమూల్ పాల యుద్ధం గురించి ఇంకా ఎవరూ మర్చిపోయి ఉండరు. అయితే ఎన్నికల అనంతరం ఇది కాస్త కుదుట పడిందో లేదో మరో వివాదం ప్రారంభమైంది. ఈసారి నందిని వర్సెస్ మిల్మా యుద్ధం సాగుతోంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ పాలు కర్ణాటకలో అమ్మడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద రాజకీయ దుమారాన్ని లేపింది. అయితే ఆ యుద్ధంలో అమూల్ మీద నందిని విజయం సాధించింది. కన్నడ నేతలంతా ముక్తకంఠంలో నందిని వైపు నిలిచారు.
ఇక తాజాగా కేరళలో కొన్ని ఔట్లెట్లను తెరిచింది నందిని. అయితే నందిని పాలు నాణ్యత లేవంటూ కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి జె చించు రాణి చేసిన వ్యాఖ్యల అనంతరం మరో దుమారం లేసింది. అంతటితో ఆగకుండా కేరళ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నుంచి వచ్చే మిల్మా పాలను వినియోగించాలని ఆమె కేరళ ప్రజలను కోరారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కేరళలో ప్రవేశించే ముందు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతి లేకుండా వచ్చారు. దీనిపై జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేస్తాం. నందిని పాలలో నాణ్యత తక్కువగా ఉంది. మిల్మా పాలను ఉపయోగించాల్సిందిగా నేను కేరళ ప్రజలను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మన ఇళ్లలో పిల్లలు పాలు ఎక్కువగా తీసుకుంటారు’’ అని అన్నారు.
Quran Burning: మసీదు ముందే ఖురాన్‌ను కాల్చేందుకు అనుమతి ఇచ్చిన పోలీసులు
నందిని ఈ సంవత్సరం కొచ్చిలోని మామల్లపురంలో తన పార్లర్‌లను ప్రారంభించింది. సమీప భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక కేరళలో నందిని ఉనికిని కేరళ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సైతం వ్యతిరేకించింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పద్దతి అనైతికమని పేర్కొంది. మిల్మా బ్రాండ్ ఛైర్మన్ కేఎస్ మణి మాట్లాడుతూ ‘కేరళకు విక్రయాలను విస్తరించేందుకు నందిని తీసుకున్న చర్య అనైతికమైంది. భారతదేశ డెయిరీ ఉద్యమ ఉద్దేశ్యాన్ని ఇది నాశనం చేస్తుంది. ఇంతకు ముందు వాల్యూ యాడెడ్ ఉత్పత్తులను మాత్రమే విక్రయించే వారు. ఇప్పుడు పాలను కూడా విక్రయిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pakistan: నా పేరు ఖాన్, నేను దేశద్రోహిని కాను.. మే 9నాటి అశాంతిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ స్పందన
అయితే దీనిపై కేరళ నుంచి వస్తున్న విమర్శలపై కర్ణాటక సహకార మంత్రి క్యాతసాండ్ర రాజన్న స్పందిస్తూ కేరళలోని నందిని వ్యాపారం అనైతికంగా ఏమీ లేదని అన్నారు. “ప్రజాస్వామ్య దేశంలో, ఎవరైనా తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇందులో అనైతికంగా ఏమీ లేదు. ఇది పోటీకి సంబంధించింది. వినియోగదారులు ఉత్తమ నాణ్యతను అందించే ఉత్పత్తిని మాత్రమే ఎంచుకుంటారు’’ అని క్యాతసాండ్ర అన్నారు.