HIndi Language : హిందీ మాట్లాడని వారు భారతదేశం వదిలి వెళ్లిపోవాలి : బీజేపీ మంత్రి వ్యాఖ్యలు

హిందీ మాట్లాడని వారు భారతదేశం వదిలి వెళ్లిపోవాలని..హిందీ మాట్లాడని వారి భారతీయులు కాదు అంటూ యూపీ బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

HIndi Language : హిందీ మాట్లాడని వారు భారతదేశం వదిలి వెళ్లిపోవాలి : బీజేపీ మంత్రి వ్యాఖ్యలు

Up Minister Sanjay Nishad

Updated On : April 30, 2022 / 11:26 AM IST

UP Minister Sanjay Nishad : ఉత్తరప్రదేశ్‌ మంత్రి సంజయ్‌ నిషాద్‌ హిందీ భాషకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. హిందీ అంటే ఇష్టపడనివారు భారతీయులు కాదని..హిందీ మాట్లాడనివారు దేశం విడిచి వెళ్లిపోవాలని అన్నారు. హిందీని ప్రేమించని వారు విదేశీయులుగా లేదా విదేశీ శక్తులతో సంబంధాలు ఏన్నవారిగా పరిగణించబడుతారంటూ వ్యాఖ్యానించారు.

Also read : RGV: సౌత్ VS నార్త్ మూవీ వార్.. హిందీ వాళ్ళకి జెలసీ అంటున్న వర్మ!

బాలివుడ్ నటుడు అజయ్ దేవగన్-కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మధ్య ట్విట్టర్ లో జరిగిన భాష గురించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మరోసారి ప్రాముఖ్యత సంతరించుకున్న భాషా చర్చపై ప్రస్తుతం దేశంలో భాష అంశంపై జరుగుతున్న చర్చకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సంజయ్‌ నిషాద్‌ స్పందిస్తూ భారత్‌లో నివసించాలనుకునే వారు తప్పనిసరిగా హిందీని ప్రేమించాల్సిందేనని అన్నారు. ఇండియా అంటే హిందుస్థాన్‌ అని రాజ్యాంగం చెబుతోందని..అంటే హిందీ మాట్లాడేవారి ప్రాంతమని అర్థం అంటూ మంత్రి విచిత్రమైన అర్థం చెప్పుకొచ్చారు సదరు మంత్రిగారు.

Also read :  RGV : ముదురుతున్న లాంగ్వేజ్ వార్.. బాలీవుడ్‌కి ఛాలెంజ్ చేస్తూ మధ్యలో దూరిన ఆర్జీవీ..

తాజాగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్.. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మధ్య మొదలైన ట్విట్టర్ కోల్డ్ వార్ చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ నుండి అభిషేక్ బచ్చన్ వరకు దీనిపై స్పదించి కామెంట్స్ చేయగా.. తాజాగా సోనూసూద్ కూడా స్పందించాడు. ‘భారతదేశం అంతటా ఒకే భాష ఉంది. అదే ఎంటర్‌టైన్‌మెంట్‌. నువ్వు ఏ చిత్ర పరిశ్రమ నుంచి అనేది ఇక్కడ అనవసరం. కానీ నువ్వు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచగలిగితే చాలు వారు నిన్ను ఆదరిస్తారు’ అంటూ సోనూసూద్ చెప్పుకొచ్చాడు.

Also read :  Sonu Sood: సౌత్ VS నార్త్.. అజయ్‌, సుదీప్‌ల ట్విటర్‌ వార్‌పై సోనూసూద్‌ కామెంట్స్!

అంతేకాదు.. ఇకపై దక్షిణాది చిత్రాల ప్రభావం మాత్రం భవిష్యత్తు హిందీ సినిమాలపై ఖచ్చితంగా ఉంటుందన్న సోనూ ‘ప్రేక్షకుడి అభిరుచుల్లో కూడా కొంత మార్పు వచ్చిందని.. వారు ప్రతి సినిమాలోనూ కంటెంట్‌ను కోరుకుంటున్నారని.. ఓ యావరేజ్‌ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు తమ వేల రూపాయలను ఖర్చు చేయాలని అనుకోవడం లేదంటూ సోనూసూద్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. సోను కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో యూపీ మంత్రి ఏకంగా హిందీ భాష మాట్లాడనివారి దేశం వదలిపోవాలంటూ చేసిన వ్యాఖ్యలు భాష గురించిన జరుగుతున్న చర్చలకు మరింత ఆజ్యం పోసేలాఉయనే అభిప్రాయాలు వస్తున్నాయి.

Also read : Language War : సుదీప్ చెప్పింది కరక్టే.. సీఎంతో సహా మద్దతిస్తున్న కన్నడ నేతలు..