Beauty Tips : ముఖం కాంతి వంతంగా మార్చుకునేందుకు చిట్కాలు

చల్లటి పాలు తీసుకోండి అలాగే కొద్దిగా నిమ్మ రసం కూడా తీసుకోవాలి. అలానే పొడి చేసిన బాదం లేదా కమలా తొక్కలు లేదు అంటే ఓట్స్ తొక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా మీరు చల్లటి పాల లో వీటిని కలపండి

Beauty Tips : ముఖం కాంతి వంతంగా మార్చుకునేందుకు చిట్కాలు

Beauty Tips

Beauty Tips : అందంగా మారాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీమ్స్ వాడతారు. ఎన్నెన్నో టిప్స్ వాడతారు. ముఖంపై కొన్ని కారణాల వల్ల ఏర్పడే నల్లని మచ్చలు అందవిహీనానికి కారణమవుతాయి. ఈ క్రమంలోనే చాలా మంది ముఖంపై నల్లని మచ్చలు ఏర్పడితే ఏవేవో సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. ఇలా నల్లటి మచ్చలతో బాధపడేవారు కేవలం సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తూ ముఖంపై ఉండే మచ్చలను త్వరగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కలబంద ; ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండే అలోవేరా ఆకుల లోపల ఉండే జెల్ ను తీసుకొని ప్రతి రోజూ 10 నిమిషాల పాటు ముఖంపై మర్దనా చేయాలి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే తప్పక ఫలితం కనిపిస్తుంది. క‌ల‌బంద గుజ్జు వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. శ‌రీరానికే కాదు, అందానికీ క‌ల‌బంద ఎంత‌గానో మేలు చేస్తుంది. చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో క‌ల‌బంద బాగా స‌హాయ ప‌డుతుంది. క‌ల‌బంద గుజ్జులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

నిమ్మకాయ ; నిమ్మకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సమస్యలు తొలగించడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. నిమ్మ కాయ లో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని ఇది ఇస్తుంది పైగా ఏమైనా సమస్య ఉంటే మనం చిటిక లో తొలగించుకోవచ్చు. నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను సులభంగా తొలగించుకోవచ్చు. నల్లని మచ్చలు ఉన్న చోట నిమ్మకాయతో ముఖాన్ని బాగా రుద్దాలి. ఈ 10 నిమిషాల పాటు చేయాలి. తరువాత కడిగేయాలి. రోజూ ఇలా చేస్తే నల్లని మచ్చలు తొలగిపోతాయి.

చల్లటి పాలు తీసుకోండి అలాగే కొద్దిగా నిమ్మ రసం కూడా తీసుకోవాలి. అలానే పొడి చేసిన బాదం లేదా కమలా తొక్కలు లేదంటే ఓట్స్  కూడా వేసుకోవచ్చు. ఇలా మీరు చల్లటి పాల లో వీటిని కలపండి. కలుపుకున్న మిశ్రమాన్ని వేసి ముఖం పై అప్లై చేయండి. పది నిమిషాలు పోయిన తర్వాత గోరు వెచ్చని నీటి తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీనితో మీకు మార్పు తెలుస్తుంది.ఇలా సులువైన ఈ పద్ధతిని మీరు కనుక అనుసరించారు అంటే ఇది నేచురల్ ఫేస్ స్క్రబ్ గా పని చేస్తుంది.

కోడిగుడ్డు ; తక్కువ ధరలోనే దొరికే కోడిగుడ్డు చేసే వండర్స్ మనందరికీ తెలిసినా ఎందుకో మనం మార్కెట్లో లభించే క్రీములు, లోషన్లు వంటివాటిపై డబ్బులు ఖర్చు చేస్తుంటాం.. సహజసిద్ధమైన గుడ్లను ఒంటికి రాసుకుంటే చాలు మీ చర్మం సరికొత్త నిగారింపును సంతరించుకుంటుంది. గుడ్డు పలు రకాల చర్మ సమస్యలు మటుమాయం అయ్యేలా చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఎగ్ ప్యాక్ లు చేసుకోవటం పెద్ద శ్రమ కూడా కాదు.

ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్డులోని తెల్లసొనను ముఖంపై ఫేస్ ప్యాక్ లా వేసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయడం వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలు మాయమవుతాయి. ఒక టీ స్పూన్ ఎగ్ వైట్ తీసుకుని, అందులో 2-3 చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖం, మెడపైన ప్యాక్ లా రాసుకుంటే మీ చర్మం బాగా బిగుతుగా మారుతుంది. దీంతో ముఖంపై వచ్చే ముడతలు, సన్నని లైన్స్ అన్నీ పోయి, తాజాగా కనిపిస్తారు. లేదా ఒక టీ స్పూన్ ఎగ్ వైట్ లోకి సగం టీ స్పూను తేనె రంగరించి రాసినా మీ చర్మంపై ముడతలు మాయం. ఇలా 15 రోజులకు ఒకసారి చేస్తే చాలు చర్మం అందంగా మారుతుంది.

టమోటా ; ముఖ కాంతిని పెంచడంలో టమాటా కీలక పాత్ర పోషిస్తుంది. టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మ రంగుని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. టమాటాలతో వారానికి రెండుసార్లు నల్లని మచ్చలపై మర్దనా చేయాలి. టమాటాను సగం కట్‌ చేసి ఆ ముక్కకు ఉన్న లోపలి గుజ్జును ముఖంపై నల్లని మచ్చలు ఉన్న చోట రుద్దాలి. 10 నిమిషాల పాటు మర్దనా చేశాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఈ మచ్చల నుంచి బయట పడవచ్చు.

రెండు చెంచాల టమాట గుజ్జు తీసుకోవాలి.. ఇందులో కాస్తా తేనె కలపాలి.. ఇలా తయారైన మిశ్రమాన్ని ముందుగా ముఖం, మెడని శుభ్రం చేసుకుని ముఖంపై రాయాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది.