Gold Price Today : శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు

గడిచిన పది రోజుల్లో బంగారం ధరల్లో భారీ మార్పులేమో చోటుచేసుకోలేదు. ఐదు రోజులు స్థిరంగా ఉంటే మరో ఐదు రోజులు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

Gold Price Today : శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు

Gold Price Today

Gold Price Today : గడిచిన పది రోజుల్లో బంగారం ధరల్లో భారీ మార్పులేమో చోటుచేసుకోలేదు. ఐదు రోజులు స్థిరంగా ఉంటే మరో ఐదు రోజులు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక మంగళవారం దేశంలోని అనేక నగరాల్లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. కొన్ని నగరాల్లో మాత్రం స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం ధరలు భవిష్యత్ లో పెరిగే అవకాశం ఉందని బిలియన్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర పెరుగుదలకు అనుకూల పరిస్థితిలు ఏర్పడుతున్నాయన్నారు. అయితే ప్రస్తుతం పెద్ద పండుగలేమి లేకపోవడం, పెళ్లి సీజన్ కూడా అయిపోతుండటంతో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవని చెబుతున్నారు బులియన్ నిపుణులు.

చదవండి : Gold Price Today : పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధర

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,260 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,560 వద్ద కొనసాగుతోంది.
ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,780 గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,780 వద్ద ఉంది.
చెన్నైలో గోల్డ్‌ ధర భారీగా తగ్గింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 100 తగ్గి రూ. 45,290గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 110 తగ్గి.. రూ. 49,400 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,120 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,220 వద్ద కొనసాగుతోంది.

చదవండి : Gold Price Today : బంగారం ధర ప్రియం.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,120 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 49,220 గా ఉంది.
విజయవాడలో మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 45,120 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 49,220 గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం రూ. 45,120 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,220 వద్ద కొనసాగుతోంది.