TS TET Results 2022: నేడు టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2022) ఫలితాలు నేడు (శుక్రవారం) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ ఫైనల్ కీ కూడా బుధవారమే విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు టెట్ ఫలితాలను విడుదల కానున్నాయి.

TS TET Results 2022: నేడు టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

Ts Tet

TS TET Results 2022: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2022) ఫలితాలు నేడు (శుక్రవారం) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ ఫైనల్ కీ కూడా బుధవారమే విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ ఇప్పటికే ఒక ప్రకటనలో వెల్లడించారు.

TS TET : టీఎస్ టెట్ ప్రాథ‌మిక ‘కీ’ రిలీజ్

టెట్ నోటిఫికేషన్లో వెల్లడించిన విధంగా జూన్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. టెట్ పరీక్ష జూన్ 12 జరిగింది. మొత్తం 3,51,468 మంది అభ్యర్థులు టెట్ పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 3,18,506 మంది అభ్యర్థులు టీఎస్ టెట్ పేపర్ -1 పరీక్షకు హాజరయ్యారు. టెట్ పేపర్-2 పరీక్షకు 2,77,900 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 2,51,070 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.

Single-Use Plastic Ban: నేటి నుంచి ఈ వస్తువులు బ్యాన్.. వాడారో.. ఫెనాల్టీ కట్టాల్సిందే..

ఇదిలాఉంటే ఈ దఫా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక అభ్యర్థి TS TET 2022 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లయితే.. నియామకం కోసం అర్హత సర్టిఫికెట్ల చెల్లుబాటు వ్యవధి జీవితాంతం ఉంటుంది. ఇదిలాఉంటే గత పరీక్షలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి సులువుగా ఉందని, ఈసారి టెట్ పరీక్షకు అధిక సంఖ్యలో విద్యార్థులు అర్హత సాధిస్తారని పలువురు అభ్యర్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు విద్యాశాఖ అధికారులు టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ tstet.cgg.gov.in/లో చెక్ చేసుకోవచ్చు.