Tollywood Star Hero’s: సీనియర్లే కానీ.. ఒక్కొక్కరు నాలుగైదు ప్రాజెక్టుల్లో రఫ్ఫాడించేస్తున్నారు!

సైన్ చేసిన సినిమా షూటింగ్స్ చకచకా పూర్తి చేసేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. 2022 లక్ష్యంగా మల్టీ టాస్కింగ్ లో తోపు అనిపించుకుంటున్నారు. నాలుగైదు ప్రాజెక్టుల్లో ఒకేసారి..

Tollywood Star Hero’s: సీనియర్లే కానీ.. ఒక్కొక్కరు నాలుగైదు ప్రాజెక్టుల్లో రఫ్ఫాడించేస్తున్నారు!

Tollywood Star Hero's (1)

Tollywood Star Hero’s: సైన్ చేసిన సినిమా షూటింగ్స్ చకచకా పూర్తి చేసేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. 2022 లక్ష్యంగా మల్టీ టాస్కింగ్ లో తోపు అనిపించుకుంటున్నారు. నాలుగైదు ప్రాజెక్టుల్లో ఒకేసారి రఫ్ఫాడించేస్తున్నారు. మేమేం తక్కువా అంటూ ఇంకొంతమంది.. సెట్స్ పై ఉన్నవి ఉండగానే.. కొత్తవాటి కోసం గట్టి ముహూర్తం పెట్టుకోబోతున్నారు. ఈ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న హీరోల సంగతేంటో ఇప్పుడు చూసేద్దాం.

2022 Tollywood Films: సినిమా కళ్లన్నీ ఈ ఏడాది మీదే.. దేశమంతా టాలీవుడ్ గురించే!

సీనియర్ స్టార్స్ దూకుడు పెంచారు. ప్రభాస్ తర్వాత హైయ్యెస్ట్ సినిమాలను లైన్లో పెట్టారు మెగాస్టార్. యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నచిరూ చేతిలో ప్రెజెంట్ 5 సినిమాలున్నాయి. వాటిలో 3.. ఈ ఏడాదినే టార్గెట్ చేసాయి. ఫిబ్రవరి 4న రాబోతున్న ఆచార్యతో పాటూ భోళాశంకర్, గాడ్ ఫాదర్ సినిమాలు 2022లోనే థియేటర్స్ కి రాబోతున్నాయి. వీలైతే బాబి సినిమాను కూడా చిరూ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. అంత స్పీడ్ చూపిస్తున్నారు మెగాస్టార్. ఇక వెంకీ కుడుమల ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకెళ్లబోతుంది.

Mohan Babu: నా మౌనం చేతగానితనం కాదు.. సినిమా టికెట్ల వివాదంపై తొలిసారి మోహన్ బాబు!

అఖండతో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు బాలకృష్ణ. 2022లో గోపీచంద్ మలినేని సినిమా రిలీజ్ ఉంటుంది. వీలైతే అనిల్ రావిపూడి సినిమాను కూడా చూపించే ఛాన్స్ ఉంది బాలయ్య. ఇవే కాకుండా అఖండ సీక్వెల్, రామానుజాచార్య.. మరికొన్ని మాటల్లో ఉన్న ప్రాజెక్ట్స్ ను ఈ ఏడాది పట్టాలెక్కించేస్తారు నటసింహం. సంక్రాంతికి బంగార్రాజుగా ఎంట్రీ ఇస్తోన్న నాగార్జున… ఘోస్ట్, బ్రహ్మాస్త్ర మూవీస్ తో ఈ ఇయర్ థ్రిల్ చేస్తారు. చేతిలో ఎలాగూ బిగ్ బాస్ ఉండనే ఉంది. ఎఫ్3 తర్వాత రానాతో చేస్తోన్న రానానాయుడు వెబ్ సిరీస్ 22లో రాబోతుంది. సల్మాన్ సినిమాతో పాటూ కొత్త సినిమాలను వెంకటేశ్ త్వరలోనే ప్రకటిస్తారు.

Sankranthi Releases: పెద్ద పండక్కి మేమున్నామంటున్న చిన్న సినిమాలు!

మాంచి స్పీడ్ మీదున్నారు రవితేజ. క్రాక్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన ఈ హీరో చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్నవాటిని ఫటాఫట్ పూర్తి చేస్తున్న మాస్ రాజా ఖిలాడి, ధమాకా, రామా రావ్ ఆన్ డ్యూటీ ని ఈ సంవత్సరమే హాళ్లకి తీసుకొస్తారు. మళ్లీ వాయిదాల వంటివి రాకుండా ఉంటే తన కెరీర్ లో 70వ సినిమా సుధీర్ వర్మ.. రావణాసుర.. 71వ సినిమా టైగర్ నాగేశ్వరరావు ప్రాజెక్ట్స్ ను రిలీజ్ చేసిన షాక్ అవ్వాల్సిన పనిలేదు. పనిలో పని చిరూ – బాబీ కాంబోలో రాబోతున్న సినిమాలో రవితేజ నటిస్తాడనే న్యూస్ అతిత్వరలో అఫీషియల్ అయ్యే ఛాన్స్ ఉంది.

RGV-AP Govt: ఇద్దరు హీరోల కోసం ప్రభుత్వం ఇలా చేస్తుందనుకోవడం లేదు: వర్మ

తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్. శంకర్ సినిమా కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసేశారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న చెర్రీ.. నెక్ట్స్ మంత్ ఆచార్య కోసం మాట్లాడక తప్పదు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తారు. శంకర్, గౌతమ్ తిన్ననూరిలతో వర్క్ చేస్తూనే ఆపై ప్రశాంత్ నీల్, సుకుమార్ ఫిల్మ్స్ ను ఓపెన్ చేసే అవకాశముంది. అంటే బ్యాక్ టు బ్యాక్ 6 సినిమాలను ఆర్డర్ లో పెట్టినా… ఈ ఏడు చూపించేది ట్రిపుల్ ఆర్, ఆచార్య మాత్రమే.