RGV-AP Govt: ఇద్దరు హీరోల కోసం ప్రభుత్వం ఇలా చేస్తుందనుకోవడం లేదు: వర్మ

గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం..

RGV-AP Govt: ఇద్దరు హీరోల కోసం ప్రభుత్వం ఇలా చేస్తుందనుకోవడం లేదు: వర్మ

Rgv Ap Govt

RGV-AP Govt: గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇప్పటికే పలుమార్లు టాలీవుడ్ పెద్దలు, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ పెద్దలను కోరడం.. ప్రభుత్వం సినీ పెద్దలతో చర్చలు జరపడం జరిగింది. అయితే.. ఇప్పటికీ ఇంకా దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Aditi Budhathoki: మనోళ్ళని ఫిదా చేసేస్తున్న నేపాలీ భామ అదితి!

అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నేచురల్ స్టార్ నానీ లాంటి హీరోలు ఈ విషయంపై స్పందించడంతో ఏపీ నేతల నుండి తీవ్రమైన స్పందనలు కూడా చూసేశాం. కాగా.. ఇప్పుడు ఇదే విషయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రాకపోతే నిర్మాతలకు నష్టం వాటిల్లితుందని.. దానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాంగోపాల్ వర్మ వెల్లడించారు.టికెట్ ధరల తగ్గింపు విధానంపై సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని వర్మ డిమాండ్ చేశారు.

Release Crash: కొత్త డేట్స్.. కొత్త క్లాషెస్.. మళ్లీ గందరగోళమేనా?

ఎవరో ఇద్దరు అగ్ర హీరోల కోసం ప్రభుత్వం ఇలా చేస్తుందని తాను అనుకోవడం లేదన్న వర్మ.. కథానాయకుల పారితోషకాల విషయంపై మంత్రులు చేసిన వ్యాఖ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు హీరోలను చూడటానికి మాత్రమే సినిమాలకు వస్తారని, బడ్జెట్ సంబంధిత అంశాల కోసం కాదని.. ప్రేక్షకుడు తన ఆర్థిక స్థోమతను బట్టి సినిమా చూస్తారని సూచించారు. ప్రభుత్వ చర్యల వల్ల సినీ పరిశ్రమతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశముందని వర్మ పేర్కొన్నారు.