Tomato Price Hike: అమ్మో టమాటా.. పెట్రోల్, చికెన్‌తోనే పోటీనా?!

కొంత కాలం నేల చూపులు చూసిన టమాట ధర ఒక్క సారిగా పెరిగింది. మూడు నెలల క్రితం కిలో టమాట రూ. 5 నుంచి 8 వరకు పలికింది. కాని మండుతున్న వేసవి ఎండల మాదిరిగా టామాట ధర అమాంతంగా ఒక్కసారిగా రూ.100కి చేరింది.

Tomato Price Hike: అమ్మో టమాటా.. పెట్రోల్, చికెన్‌తోనే పోటీనా?!

Tomato Price Hike

Tomato Price Hike: కొంత కాలం నేల చూపులు చూసిన టమాట ధర ఒక్క సారిగా పెరిగింది. మూడు నెలల క్రితం కిలో టమాట రూ. 5 నుంచి 8 వరకు పలికింది. కాని మండుతున్న వేసవి ఎండల మాదిరిగా టామాట ధర అమాంతంగా ఒక్కసారిగా రూ.100కి చేరింది. రైతు బజార్లు, పెద్ద పెద్ద మార్కెట్లలో మంచి టమాటాలు కిలో రూ.80 పలుకుతుంటే చిన్న చిన్న మార్కెట్లలో రూ.100కి చేరింది. దీనికి ప్రధాన కారణంగా మండే ఎండలు, భూగర్భ జలాలు అడుగంటి పోవడమే. దీంతో టమాట దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది.

Chicken Price: వేసవి ఎఫెక్ట్.. మాంసాహార ప్రియులకు షాక్..

ప్రస్తుతం జంట నగరాల్లో ఉన్న మెండా మార్కెట్, బోయిపల్లి వంటి హోల్‌సేల్ మార్కెట్లతో పాటు మెహదీపట్నం, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, ఎల్‌బినగర్, వనస్థలిపురం వంటి ప్రధాన రైతు బజార్లలో కూడా టమాట కొరత ఏర్పడింది. సాధారణ రోజుల్లో నగరానికి 80 నుంచి 100 లారీల టమాట దిగుమతి అవుతుంటే ప్రస్తుతం రోజుకు 50 లారీల రావడం కూడా కష్టమైందని మార్కెట్ శాఖ అధికారులు చెబుతున్నారు. హొల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాట రూ.50 నుంచి 55 పలుకుతోండగా.. మార్కెట్లలో రూ.80 నుండి రూ.100 పలుకుతుంది.

Somu Veerraju On Alliance : బీజేపీ-జనసేన పొత్తు.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా టమాటా ధరలు కొండెక్కాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్టయిన మదనపల్లె మార్కెట్లో కిలో టమాటా రూ.60కి చేరితే ఇది వినియోగదారుల వద్దకు చేరేసరికి సెంచరీకి చేరింది. గత మూడు నెలలగా భగ్గుమన్న సూర్యుడి ప్రతాపంతో టమాటా దిగుబడి భారీగా పడిపోగా.. ఇప్పుడు వేసవిలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉన్న కాస్త పంటా దెబ్బతిన్నది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో టమాటాకి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవడంతో ధర అమాంతం కొండెక్కి కూర్చుంది. ఒకవైపు పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పోగా.. చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు పోటీగా టమాటా కూడా సెంచరీ కొట్టేసింది.