SCCL : బొగ్గు గనిలో విషాదం…కార్మికుల ఆందోళన, ఒకరికి ఉద్యోగం ఇస్తాం

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ త్రి ఇంక్లైన్‌ గనిలో జరిగిన ప్రమాదంలో నలుగురి కార్మికుల మృతి చెందడంపై సింగరేణి యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

SCCL : బొగ్గు గనిలో విషాదం…కార్మికుల ఆందోళన, ఒకరికి ఉద్యోగం ఇస్తాం

Sccl

Singareni Coal Mine : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ త్రి ఇంక్లైన్‌ గనిలో జరిగిన ప్రమాదంలో నలుగురి కార్మికుల మృతి చెందడంపై సింగరేణి యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తక్షణ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సింగరేణి సీఎండీ శ్రీధర్‌. మృతుల కుటుంబాలకు సింగరేణి సంస్థ అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాల్లో అర్హులైన ఒకరికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగం ఇస్తామని, మృతుల కుటుంబాలకు…కంపెనీ ద్వారా చెల్లించే సొమ్మును వెంటనే అందిస్తామన్నారు. మ్యాచింగ్ గ్రాంట్‌, గ్రాట్యుటీ కలిపి 70 లక్షల రూపాయల నుంచి కోటి రూపాల వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

Read More : Haryana CM : పద్మశ్రీ అవార్డుతో సీఎం ఇంటి ముందు నిరసన

ఎస్‌ఆర్‌పీ 3 బొగ్గు గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మృతులు చంద్రశేఖర్, లచ్చయ్య, సత్యనారాయణ, కృష్ణారెడ్డి మృతదేహాలను రెస్క్యూటీమ్‌ బయటకు తీసుకొచ్చింది. ఆ వెంటనే మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరిగింది. మృతదేహాలను కుటుంబసభ్యులకు  అప్పగించి…స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. కార్మికులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న గని బయట కార్మికులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read More : Sajjala : ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారు

మృతదేహాలను అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో కార్మికులు, మృతుల కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. సింగరేణి యాజమాన్యానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు సింగరేణి ఇచ్చే బెనిఫిట్స్ కాకుండా అదనంగా కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోటి రూపాయల వరకు నష్ట పరిహారం అందే అవకాశాలున్నాయని సింగరేణి సీఎండీ ప్రకటన చేశాక ఆందోళన విరమించారు కార్మికులు.