Transgender Right :జైళ్లలో ట్రాన్స్‌జెండర్ల హక్కులకు కాపాడటానికి చర్యలు తీసుకోండి : కేంద్రం సూచనలు

జైళ్లలో ఉన్న ట్రాన్స్‌జెండర్ల హక్కులకు కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని..వారి దోపిడీకి గురి కాకుండా చూడాలని అన్ని రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.

Transgender Right :జైళ్లలో ట్రాన్స్‌జెండర్ల హక్కులకు కాపాడటానికి చర్యలు తీసుకోండి : కేంద్రం సూచనలు

Transgender Right

Center Govt instructions states care of transgenders in prison: ట్రాన్స్‌జెండర్లు సమాజంలో అవమానాలకు గురి అవుతున్న థర్డ్ జెండర్స్.ట్రాన్స్‌జెండర్లు ఎక్కువగా భిక్షాటనపైనే ఆధారపడి జీవిస్తుంటారు. దోపిడీకి గురి అవుతుంటారు. కొంతమంది ట్రాన్స్‌జెండర్లు మాత్రం నేరాలకు పాల్పడుతుంటారు. అలా నేరం చేసి జైళ్లలో ఉన్న ట్రాన్స్‌జెండర్ల హక్కులను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు..కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. జైళ్లలో ఉన్న ట్రాన్స్‌జెండర్లు ఎటువంటి దోపిడీకి గురికాకుండా రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది.

Read more:woman constable gender change : మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడికి హోంశాఖ అనుమతి..సర్జరీ తరువాత ఉద్యోగం చేయొచ్చు..

ట్రాన్స్‌జెండర్ల (హక్కుల రక్షణ) చట్టం, 2019.. ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు, వివక్ష నుంచి రక్షణతో పాటు ప్రభుత్వాలు వారి కోసం చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలను నిర్దేశిస్తోందంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. జైళ్లలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. జైళ్లలోని పురుషుల ఖైదీలతో గానీ..మహిళా ఖైదీలతో కలిపి ట్రాన్స్ జెండర్లను ఉంచవద్దని వారిని వేరే వార్డుల్లో ఉంచాలని సూచించింది.

Read more: Police Jobs to Transgenders : ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు పోలీస్ ఉద్యోగాలు..నోటిఫికేష‌న్ జారీ చేసిన ప్రభుత్వం

అదే సమయంలో ఇటువంటి ఏర్పాటు వల్ల వారిపై వివక్ష చూపుతున్నారనే భావన వారిలో కలుగకుండా చూడాలని..వారి రక్షణ కోసమే ఇలా చేశారని భావనవారిలో కలిగాలని సూచించారు. వారిని సమాజం నుంచి పూర్తిగా దూరం చేశారన్న భావన వారికి రాకుండా జాగ్రత్త వహించాలని..ఇది చాలా సున్నితమైన విషయమని సూచించింది. మానసిక ఆరోగ్యం, లింగ నిర్ధారణ ప్రక్రియ, విడుదల అనంతరం పునరావాసం, సామాజిక న్యాయం వంటి అంశాల్లోనూ సున్నిత దృష్టితో చూడాలని కోరింది.

Read more : లింగ మార్పిడి చేయించుకుని యువతిని పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్

ఈ సందర్భంగా..ట్రాన్స్ జెండర్లు కూడా సమజాంలో భాగమని వారిని గౌరవించాలని..తోటి మనుషుల్లాగానే వారిని చూడాలని సమాజానికి సూచనలు చేసింది కేంద్ర ప్రభుత్వం.