Thaman-Devisri Prasad : మ్యూజిక్ డైరెక్టర్స్ పై వరుస ట్రోల్స్.. ఇకనైనా మారుతారా??

టాలీవుడ్ లోనేకాదు, సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పోటీపడుతున్నారు థమన్, దేవిశ్రీప్రసాద్. సాంగ్స్, టీజర్ల దగ్గరనుంచి ప్రమోషనల్ వీడియోల వరకూ ప్రతి చిన్నవిషయంలో................

Thaman-Devisri Prasad : మ్యూజిక్ డైరెక్టర్స్ పై వరుస ట్రోల్స్.. ఇకనైనా మారుతారా??

Devisri Prasad

Thaman-Devisri Prasad :   నామ్యూజిక్ బావుండాలి అంటే, నామ్యూజిక్ బావుండాలి అంటూ మ్యూజిక్ డైరెక్టర్లు పోటీ పడుతుంటారు. థమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య ఆ హెల్తీ వార్ అలాగే ఉంటుంది. పోటీకి తగ్గట్టే వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. అదిరిపోయే ట్రాక్స్ తో, మెస్మరైజింగ్ ట్యూన్స్ తో రెడీ అవుతున్నారు దేవిశ్రీ ప్రసాద్, థమన్. అయినా ఫ్యాన్స్ ట్రోలింగ్ ని తప్పించుకోలేకపోతున్నారు.

టాలీవుడ్ లోనేకాదు, సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పోటీపడుతున్నారు థమన్, దేవిశ్రీప్రసాద్. సాంగ్స్, టీజర్ల దగ్గరనుంచి ప్రమోషనల్ వీడియోల వరకూ ప్రతి చిన్నవిషయంలో ఫుల్ కాంపిటీటివ్ గా ఉన్న థమన్ , దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ కొట్టిన ట్యూన్సే రిపీటెడ్ గా కొట్టడంలోనూ పోటీ పడుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్స్ తో ఎటాక్ చేస్తున్నారు. ఇటీవల ఉప్పెన సినిమాలో జల జల పాతం సాంగ్ ను లేటెస్ట్ గా ది వారియర్ సినిమాలో దడ దడమని హృదయం శబ్ధం పాటగా మార్చేసి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లవర్స్ కి దొరికిపోయారు. ఇలా ఇప్పటికే చాలా సార్లు దొరికిపోయాడు దేవిశ్రీ.

ఇక థమన్ కాపీ కొట్టడంలో నాకు నేనే సాటి అన్న రేంజ్ లోనే ఉంటాయి కాపీట్యూన్స్. రీసెంట్ గా సూపర్ స్టార్ సినిమా సర్కార్ వారి పాట కోసం మమ మహేశా… సాంగ్ లోని చరణం యాజ్ టీజ్ గా సరైనోడు సినిమాలోని సిలకలూరు సింతామణి సాంగ్ చరణంలోని ట్యూన్ నే దింపేసి చేతులు దులుపుకోవడంతో మహేశ్ ఫ్యాన్స్ థమన్ పైన కోపంగా ఉంటే, యాంటి ఫ్యాన్స్ ట్రోల్స్ చేసి ఆడుకుంటున్నారు. ఇక థమన్ కాపీ ట్యూన్స్ గురించి సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ తెలిసిందే. వీటిపై గతంలోనే థమన్ స్వయంగా స్పందించాడు.

Sukruthi : కేరింత నటి నిశితార్థం.. త్వరలోనే పెళ్లి..

సినిమాల విషయంలో చిన్నా, పెద్దా అన్న తేడా చూపించని థమన్, దేవిశ్రీప్రసాద్ ఏ హీరోకి ఆ హీరో రేంజ్, క్రేజ్ కి తగినట్టు మ్యూజిక్ ఇస్తారు. ప్రస్తుతం థమన్ నాగచైతన్య థాంక్యూ, చిరంజీవి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ -శంకర్ మూవీ తోపాటు అఖిల్ ఏజెంట్, గుణశేఖర్ తో శాకుంతలం, బాలకృష్ణ 107 సినిమాలకు కమిట్ అయ్యి ఉంటే, దేవిశ్రీ ప్రసాద్ పుష్ప2 సినిమాతో పాటు, వైష్ణవ్ తేజ్ రంగరంగవైభవంగా, చిరూ, బాబి కాంబినేషన్ సినిమాతో పాటు భవదీయుడు భగత్ సింగ్ సినిమాల కోసం ట్యూన్స్ కంపోజ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. మరి వచ్చే సినిమాల్లో అయినా కాపీ ట్యూన్స్ లేకుండా జాగ్రత్త పెడతారేమో చూడాలి.