Telangana : బీజేపీని తిట్టటానికే టీఆర్ఎస్ ప్లీనరీ.. : బండి సంజయ్

BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ 21వ ప్లీనరీ ఏర్పాటు చేసింది కేవలం బీజేపి (కేంద్ర ప్రభుత్వాన్ని) తిట్టటానికి మాత్రమే తప్ప అంతకు మించి ఏమీలేదన్నారు.

Telangana : బీజేపీని తిట్టటానికే టీఆర్ఎస్ ప్లీనరీ.. : బండి సంజయ్

Kcr Bandi Sanjay

Ts BJP president Bandi Sanjay reacts : BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ 21వ ప్లీనరీ ఏర్పాటు చేసింది కేవలం బీజేపి (కేంద్ర ప్రభుత్వాన్ని) తిట్టటానికి మాత్రమే తప్ప అంతకు మించి ఏమీలేదన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిదేమీ లేదు కాబట్టి చెప్పుకోవటానికి ఏమీ లేదని అందుకే బీజేపీని తిట్టటానికే ప్లీనరి ఏర్పాటు చేశారు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గురువారం (ఏప్రిల్ 28,2022) బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను చూసి టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకొందన్నారు. ఈ పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛంధంగా వచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టేందుకే టీఆర్ఎస్ ప్లీనరీని ఏర్పాటు చేశారన్నారు. పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేసుకోవాలి, రానున్న రోజుల్లో ఎలా ఉండాలనే దానిపై ప్లీనరీలో చర్చిస్తారన్నారు. కానీ దానికి భిన్నంగా టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది అంటూ విమర్శించారు.

కేసీఆర్ లక్కీ నంబర్ (6)33 రకాల వంటకాలు తిని నేతలంతా నిద్రపోయారు : బండి
ప్లీనరీలో 33 రకాల మాంసం కూరలు వండి తినటానికి మాత్రమే ప్లీనరీ వాడుకున్నారని ఆ తరవుాత బీజేపీని తిట్టారని అన్నారు. 33 రకాల వంటకాలంటే సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ 6 కాబట్టి 33 రకాల వంటకాలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఏం చేసిని 6 వచ్చేలాగానేచూసుకుంటారని అన్నారు. 6 నంబర్ మీద నడిచే సీఎం కేసీఆర్ కు చివరకు వచ్చే ఎన్నికల్లో ఆ ఆరు సీట్లే వస్తాయని ఎద్దేవా చేశారు. 33 రకాల వంటకాలు తిన్న నేతలు భోజనం తరువాత అస్సలు ప్లీనరీలో ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా హాయిగా నిద్రపోయారంటూ సెటైర్లు వేశారు. ఫుల్ గా తిన్న మాంసం కూరలమీద చర్చ పెట్టటానికే ప్లీనరి అంటూ ఎద్దేవా చేశారు.

ప్రజలకు ఏం చేశామో చెప్పుకోవటానికి టీఆర్ఎస్ కు ఏమీ లేదు..
ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు ఏం చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేక టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు చేశారని బండి సంజయ్ చెప్పారు. బీజేపీ రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు ఏమి చేసిందో మేం చెప్పగలం అని కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రజలకు ఏం చేసిందో చెప్పటానికి ఏమీ లేదని అందుకే ప్లీనరీలో కేవలం బీజేపీని తిట్టటమే పనిగా పెట్టుకున్నారంటూ విమర్శించారు. 2014లో మోడీ ప్రధానిగా అధికారాన్ని చేపట్టే నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండేదని బండి సంజయ్ చెప్పారు.ఈ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక ప్రయత్నాలను కేంద్రం చేపట్టిందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. విదేశీ నేతలకు కూడా ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఏ స్థాయి నుండి భారత ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేశారో వారు వివరించారని సంజయ్ వివరించారు.రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీయేనని కేసీఆర్ గడీలు బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.

కేసీఆర్ ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందో చెప్పాలి..
తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందని చెప్పుకునే కేసీఆర్ ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందో చెప్పాలని బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు. రూ. 4 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటూ విమర్శించారు. రోజుకో జిల్లాకు జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దిగజార్జాడని ఆయన కేసీఆర్ పై మండిపడ్డారు. ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు ఎందుకు జీతాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.రూ. 70 వేల కోట్లు డిస్కంలకు ప్రభుత్వం అప్పు ఉందన్నారు. విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. మే మాసం విద్యుత్ బిల్లులు వస్తే వినియోగదారులకు గుండెపోటు వస్తుందని బండి సంజయ్ చెప్పారు.

రూ. 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును రూ. 1 లక్ష కోట్లకు అంచనాలు పెంచి దోచుకోలేదా అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలను రూ. 70 వేలకు పెంచి కేసీఆర్ దోచుకొన్నాడని బండి సంజయ్ విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పులపాలైందన్నారు. కానీ కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం ఆస్తులు పెంచుకొన్నారని బండి సంజయ్ ఆరోపించారు.