TSPSC Paper Leak : ఈసారైనా నోరు విప్పుతారా? ఆ నలుగురు నిందితులే సిట్ కస్టడీకి

నిందితులు సమాచారం ఇవ్వలేదని, పేపర్ లీక్ లో జరిగిన చైన్ ప్రాసెస్ పై నిందితులు నోరు మెదపలేదని సిట్ అధికారులు తెలిపారు.(TSPSC Paper Leak)

TSPSC Paper Leak : ఈసారైనా నోరు విప్పుతారా? ఆ నలుగురు నిందితులే సిట్ కస్టడీకి

TSPSC Paper Leak : తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులను కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఏ-1 ప్రవీణ్, ఏ-2 రాజశేఖర్, ఏ-4 డాక్య, ఏ-5 కేతావత్ రాజేశ్వర్ లను కస్టడీకి అనుమతించింది. మూడు రోజుల పాటు నలుగురు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు. ఆదివారం నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మిగిలిన ముగ్గురు నిందితుల(షమీమ్, సురేశ్, రమేశ్) కస్టడీ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.

Also Read..TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

ఇక, టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ కస్టడీ రిపోర్టు 10టీవీ చేతికి లభించింది. తొలిసారి కస్టడీలో నిందితులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు సమాచారం ఇవ్వలేదని సిట్ అధికారులు కూడా చెప్పారు. పేపర్ లీక్ లో జరిగిన చైన్ ప్రాసెస్ పై నిందితులు నోరు మెదపలేదు. కేవలం ముగ్గురి పేర్లు మాత్రమే నిందితులు చెప్పారు.(TSPSC Paper Leak)

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో మరోసారి ఏడుగురు నిందితులను కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు. అయితే, నలుగురు నిందితులను మాత్రమే కస్టడీకి అనుమతించింది కోర్టు. తొలిసారి కస్టడీలో నిందితులు సరైన సమాచారం ఇవ్వలేదని సిట్ అధికారులు తెలిపారు. ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం చేశారు. ఆ నిందితులు ఇచ్చిన కొంత సమాచారం మేరకే.. షమీమ్, సురేశ్, రమేశ్ లను అరెస్ట్ చేసినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు.

Also Read..TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

కస్టడీ రిపోర్టులో సిట్ అధికారులు అనేక కీలక అంశాలు వెల్లడించారు. గతంలో అరెస్ట్ అయిన 9మంది నిందితులను 6రోజుల పాటు విచారించారు. కానీ, ఆ విచారణలో నిందితులు సరైన సమాధానాలు చెప్పలేదు. సమాచారం కూడా ఇవ్వలేదు. వారంతా కూడా దాటవేత ధోరణి ప్రదర్శించారు. అయితే, వారిచ్చిన కొంత సమాచారంతో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.(TSPSC Paper Leak)

”పేపర్ లీక్ కేసులోని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి 6రోజుల కస్టడీకి కోరాము. అయితే, నలుగురు నిందితులను మాత్రమే అదీ మూడు రోజుల సిట్‌ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులోని ఏ -1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్ నిందితులను మాత్రమే సిట్‌ కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో రేపటి (మార్చి 26) నుంచి మంగళవారం వరకు వీళ్లను కస్టడీకి తీసుకుని విచారిస్తాం. మిగిలిన ముగ్గురు (ఏ-10 షమీమ్, ఏ -11, సురేశ్, ఏ -12 రమేశ్) కస్టడీ పిటిషన్‌ను మాత్రం సోమవారానికి వాయిదా వేసింది కోర్టు” అని సిట్ అధికారులు తెలిపారు.