TSPSC Paper Leak : TSPSC పేపర్ లీక్ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా

TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో రెండో రోజూ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. 9మంది నిందితులను సిట్ ప్రశ్నించింది. నిందితుల నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.

TSPSC Paper Leak : TSPSC పేపర్ లీక్ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా

TSPSC Paper Leak : TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో రెండో రోజూ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. 7గంటలకు పైగా 9మంది నిందితులను సిట్ ప్రశ్నించింది. నిందితుల నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. లీక్ చేసిన పేపర్లను వాట్సాప్ లో షేర్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నంలో సిట్ ఉంది. నిందితుల ఆర్థిక లావాదేవీలపైనా సిట్ బృందం ఆరా తీసింది.

ఏఈ, టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పేపర్లు నిందితులు కాపీ చేసి వాట్సాప్ ద్వారా షేర్ చేసినట్లు సిట్ గుర్తించింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల వ్యక్తిగత కంప్యూటర్లను సిట్ అధికారులు ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. ప్రశ్నాపత్రాలను వాట్సాప్ లో ఎంతమందికి షేర్ చేశారు? ఎవరెవరికి షేర్ చేశారు? ఇలా అన్ని విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు రాబడుతున్నారు సిట్ అధికారులు.(TSPSC Paper Leak)

Also Read..TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ బృందం దర్యాఫ్తును ముమ్మరం చేసింది. రెండో రోజు(మార్చి 19) కూడా 9మంది నిందితులను సుదీర్ఘంగా విచారించింది. ఒక్కొక్కరిని సెపరేట్ గా విచారించారు. రెండో రోజు విచారణలో టెక్నికల్ అంశాలపై సిట్ దృష్టి సారించింది. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాన్ఫిడెన్స్ సిస్టమ్ తో టీఎస్ పీఎస్ సీ తీసుకొచ్చిన హార్డ్ డిస్క్, సీపీయూ నుంచి డేటా అనలైజ్ చేసే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. డీసీపీతో పాటు ఏసీపీ కూడా నేరుగా ఇవాళ అంతా సాంకేతిక అంశాలపై ఫోకస్ పెట్టారు. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ కూడా కాసేపు ఉండి వెళ్లారు.

ఇవాళ్టి విచారణలో సైబర్ క్రైమ్ కు సంబంధించిన టీమ్ ఎక్కువగా నిందితులను విచారించింది. నిందితుల స్టేట్ మెంట్లు రికార్డ్ చేశారు. నిందితుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆరా తీశారు. ఇవాళ్టి విచారణ మొత్తాన్ని వాయిస్ రికార్డ్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. 9మంది నిందితుల్లో ముగ్గురిని చాలాసేపు విచారించినట్లు సమాచారం. ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలను ఎక్కువసేపు విచారించారు.(TSPSC Paper Leak)

Also Read..Minister KTR : పేపర్ లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.. బీజేపీపై అనుమానం : మంత్రి కేటీఆర్

కేవలం మార్చి5న జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారం మాత్రమే కాకుండా.. గత ఏడాది అక్టోబర్ లో జరిగిన పేపర్లకు సంబంధించి విచారించారు. ఆ పేపర్లను ఎలా లీక్ చేశారు? వాటిని ఏ విధంగా షేర్ చేశారు? అనేది దర్యాఫ్తు చేశారు. గతేడాది అక్టోబర్ లో జరిగిన గ్రూప్-1 పేపర్ కి సంబంధించి.. రాజశేఖర్ వాట్సాప్ చాటింగ్ లో వందల మందికి షేర్ చేసినట్లు గుర్తించారు.

Also Read..TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

ప్రవీణ్ లీక్ చేసిన క్వశ్చన్ పేపర్లను.. రేణుక కొందరికి విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ కేసులో లావాదేవీల విషయంలో చోటు చేసుకున్న విభేదాల కారణంగానే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు కనుగొన్నారు.

గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఏడు పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. ఫుడ్ సేప్టీ ఆఫీసర్, సీపీడీవో, సూపర్ వైజర్ గ్రేడ్-2, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈ పరీక్షలు నిర్వహించారు. అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైందని సిట్ బృందం నిర్ధారించింది. మిగిలిన పరీక్షలు జరిగిన తీరుపైనా ఫోకస్ పెట్టారు. గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా టీఎస్ పీఎస్ సీ 2 రోజుల క్రితం ప్రకటించింది. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంతో పాటు మరో నాలుగు ప్రశ్నాపత్రాలను కూడా ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో డౌన్ లోడ్ చేసుకున్నట్లు సిట్ బృందం గుర్తించింది.

క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 18 నుంచి నిందితులను సిట్ బృందం ప్రశ్నిస్తుంది. ఇవాళ(మార్చి 19) రెండో రోజున సిట్ అధికారులు నిందితులను సుదీర్ఘంగా విచారించారు. 2022 అక్టోబర్ నెల నుంచి జరిగిన ఏడు పరీక్షలపై కూడా సిట్ టీమ్ ఫోకస్ పెట్టింది. ఈ ఏడు పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఈ ఏడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఏమైనా లీయయ్యాయా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.