Twitter: రేపే ‘ట్విట్టర్ బ్లూ’ రీలాంఛ్.. ఐఫోన్లకు ఎక్కువ ఛార్జీ వసూలు

ఈ నెల 12న ‘ట్విట్టర్ బ్లూ’ ప్రీమియమ్ లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ అనే సంగతి తెలిసిందే. గతంలో కంపెనీలు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, జర్నలిస్టులకు మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్ ఆప్షన్ ఉండేది.

Twitter: రేపే ‘ట్విట్టర్ బ్లూ’ రీలాంఛ్.. ఐఫోన్లకు ఎక్కువ ఛార్జీ వసూలు

Twitter: మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సంస్థ తీసుకొచ్చిన ‘ట్విట్టర్ బ్లూ’ సోమవారం రీలాంఛ్ కానుంది. ఈ నెల 12న ‘ట్విట్టర్ బ్లూ’ ప్రీమియమ్ లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ అనే సంగతి తెలిసిందే. ట్విట్టర్లో బ్లూ టిక్ కావాలంటే ప్రతి నెలా ఛార్జీలు చెల్లించాలి.

Sukhvinder Sukhu: చిన్నతనంలో పాలమ్మిన డ్రవైర్ కొడుకు నుంచి నేడు ముఖ్యమంత్రి వరకు.. హిమాచల్ నూతన సీఎం ప్రస్థానం

గతంలో ఈ సర్వీస్ ఉచితంగా ఉండేది. కానీ, ఎలన్ మస్క్ ట్విట్టర్ సొంతం చేసుకున్న తర్వాత దీన్ని పెయిడ్ సర్వీస్‌గా మార్చారు. గత నెలలోనే దీన్ని తీసుకొచ్చారు. అయితే, ఫేక్ అకౌంట్లు, అనేక విమర్శల నేపథ్యంలో ఈ సర్వీస్ తాత్కాలికంగా రద్దు చేశారు. కొన్ని మార్పులతో మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ట్విట్టర్ బ్లూ’ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ సారి కొన్ని కీలక మార్పులు చేశారు. గతంలో కంపెనీలు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, జర్నలిస్టులకు మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్ ఆప్షన్ ఉండేది. అయితే, ఈసారి 8 అమెరికా డాలర్లు చెల్లించిన ప్రతి ఒక్కరికీ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వాలని మస్క్ నిర్ణయించాడు. దీంతో సామాన్యులు కూడా ‘ట్విట్టర్ బ్లూ’ పొందవచ్చు.

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్తగా మరో 7,029 పోస్టుల భర్తీకి ఆమోదం

కానీ, వ్యక్తులు, సంస్థలకు వేర్వేరు రంగులతో కూడిన బ్లూటిక్ ఇస్తారు. ఈసారి నుంచి ఐఫోన్ యూజర్ల నుంచి మాత్రం 11 డాలర్లు వసూలు చేయనుంది ట్విట్టర్. ఐఫోన్లో ట్విట్టర్ బ్లూ వాడాలంటే అంత మొత్తం చెల్లించాల్సిందే. ‘ట్విట్టర్ బ్లూ’ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి తక్కువ అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తాయి. వాళ్లు ఎక్కువ నిడిడి కలిగిన వీడియోలు పోస్ట్ చేయొచ్చు. వాళ్లు చేసే ట్వీట్లకు ప్రాధాన్యం ఉంటుంది.