Ravi Teja: సినిమా ఒక్కటే.. హీరోయిన్స్ మాత్రం ఇద్దరు ముగ్గురు!

ఒకరొద్దు.. ఇద్దరైతే ముద్దు.. ముగ్గురొస్తే మస్తీనే అంటున్నాడు రవితేజ. సినిమాల విషయంలో ఫాస్ట్ ఫాస్ట్ గా నంబర్ పెంచేసినట్టు.. ఆ సినిమాల్లో నటించే హీరోయిన్స్ ను ఇద్దరికి తగ్గకుండా..

Ravi Teja: సినిమా ఒక్కటే.. హీరోయిన్స్ మాత్రం ఇద్దరు ముగ్గురు!

Ravi Teja

Ravi Teja: ఒకరొద్దు.. ఇద్దరైతే ముద్దు.. ముగ్గురొస్తే మస్తీనే అంటున్నాడు రవితేజ. సినిమాల విషయంలో ఫాస్ట్ ఫాస్ట్ గా నంబర్ పెంచేసినట్టు.. ఆ సినిమాల్లో నటించే హీరోయిన్స్ ను ఇద్దరికి తగ్గకుండా ఫిక్స్ చేసుకుంటున్నాడు. కొత్త హీరోయిన్స్ కి మాక్సిమమ్ ఛాన్సెస్ ఇస్తూ వాళ్లకి మాస్ రాజా ఫుల్ కిక్కు ఇచ్చేస్తున్నాడు.

Ravi Teja: కరోనా వేవ్‌ను సక్సెస్ వేవ్‌గా మార్చుకున్న మాస్ రాజా!

వరుసగా సినిమాలను ప్రకటించడం.. ఆ సినిమాలను హై స్పీడ్ లో చుట్టేయడమే కాదు.. హీరోయిన్స్ విషయంలోనూ తగ్గేదేలే అంటున్నాడు రవితేజ. ఒక్కో సినిమాకు ఇద్దరు, ముగ్గురు అంతకు మించి అందగత్తెలను సెట్ చేస్తున్నాడు. ఉగాది రోజు గ్రాండ్ గా లాంచ్ కాబోతున్న మాస్ రాజా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు కోసం ఇద్దరు హీరోయిన్స్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. కృతి సనన్ సిస్టర్ నుపుర్ సనన్ ఓ హీరోయిన్ కాగా టైగర్ నాగేశ్వరరావ్ లో మరో హీరోయిన్ గా మోడల్ కమ్ యాక్టర్ గాయత్రి భరద్వాజ్ ను తీసుకొచ్చారు.

Ravi Teja: సక్సెస్ తెచ్చిన కిక్.. కోవిడ్‌ను లెక్క చేయని హీరో మాస్ రాజా!

త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్ లో రవితేజ నటిస్తున్న సినిమా ధమాకా. ఇందులో ఈ హీరో సరసన శ్రీలీల ఆల్ రెడీ ఫిక్సయింది. శ్రీలీలతో పాటూ మరో హాట్ గర్ల్ కూడా ధమాకాలో కనిపిస్తుందంటున్నారు. అలాగే జూన్ 17న రిలీజ్ కాబోతున్న రామారావ్ ఆన్ డ్యూటీలోనూ మాస్ రాజా జోడీగా ఇద్దరు భామలు మెరవబోతున్నారు. మలయాళీ యాక్ట్రెస్ రాజీషా విజయన్ తో పాటూ రామారావ్ ఆన్ డ్యూటీలో దివ్యాంశ కౌశిక్ లేడీ లీడ్ గా కనిపించబోతుంది.

Ravi Teja: ఫిప్త్ గేర్‌లో దూసుకెళుతున్న మాస్ రాజా!

సుధీర్ వర్మ, రవితేజ కాంబినేషన్ లో ఈమద్యే సెట్స్ పైకెళ్లిన సినిమా రావణాసుర. సుశాంక్ నెగెటివ్ రోల్ చేస్తోన్న ఈ మూవీలో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా ఐదుగురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయెల్, పూజితా పొన్నాడ, మేఘా ఆకాశ్, దక్షా నగర్కర్ తో పాటూ జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా… మాస్ రాజా రావణాసుర కోసం హీరోయిన్స్ గా ఫిక్స్ అయ్యారు.