Unemployment: దేశంలో పెరిగిన నిరుద్యోగిత రేటు: అత్యధికంగా హర్యానా, రాజస్థాన్

దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం ప్రధాన సమస్యగా మారింది. దేశ వ్యాప్తంగా సరాసరి నిరుద్యోగిత రేటు మార్చిలో 7.60% ఉండగా ఏప్రిల్‌లో 7.83%కి పెరిగింది.

Unemployment: దేశంలో పెరిగిన నిరుద్యోగిత రేటు: అత్యధికంగా హర్యానా, రాజస్థాన్

Unem

Unemployment: దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం ప్రధాన సమస్యగా మారింది. దేశ వ్యాప్తంగా సరాసరి నిరుద్యోగిత రేటు మార్చిలో 7.60% ఉండగా ఏప్రిల్‌లో 7.83%కి పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (CMIE) వెల్లడించిన నివేదిక ప్రకారం, నగరాల్లో నిరుద్యోగం రేటు మార్చిలో 8.28% నుండి 9.22%కి పెరిగింది. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు తగ్గింది. గ్రామాల్లో నిరుద్యోగిత రేటు మార్చిలో 7.29% ఉండగా ఏప్రిల్ లో 7.18%కి పడిపోయింది. రాష్ట్రాల వారీగా నిరుద్యోగిత రేటును పరిశీలిస్తే హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది.

Also Read:Indian Bank : ఇండియన్ బ్యాంక్ లో స్పోర్ట్స్ కోటా క్లర్క్ పోస్టుల భర్తీ

హర్యానాలో నిరుద్యోగ రేటు 34.5% కాగా, రాజస్థాన్‌లో నిరుద్యోగిత రేటు 28.8%గా ఉన్నట్లు సీఎంఐఇ వెల్లడించింది. అత్యల్పంగా హిమాచల్ ప్రదేశ్‌లో నిరుద్యోగిత రేటు 0.2% నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో 1.6%గా ఉంది. ఈ విధంగా, మధ్యప్రదేశ్ దేశంలో అత్యల్ప నిరుద్యోగిత రేటులో 6వ స్థానంలో ఉంది. హర్యానాలో నిరుద్యోగిత రేటు పెరగడానికి మూడు కారణాలు పేర్కొన్నారు. రెండేళ్లుగా ఉద్యోగాలు కల్పనలో ప్రభుత్వం విఫలమవడం, రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రభావితమైన వ్యాపార రంగం, నిరంతర విద్యుత్ కోతల కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి పడిపోవడం వంటి కారణాల వలన హర్యానాలో నిరుద్యోగిత శాతం పెరిగినట్లు సీఎంఐఇ నివేదించింది.

Also read:Festival Wishes: అక్షయ తృతీయ, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని

నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఒక్క ఏప్రిల్ లోనే సుమారు 38 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో కోట్లాది మంది ఉద్యోగ అన్వేషణను విర్మానించుకున్నారు. దేశంలో బలహీనమైన ఆర్థిక కార్యకలాపాలే ఉద్యోగాలు కోల్పవడానికి కారణమని సీఎంఐఇ పేర్కొంది. డెలాయిట్ ఇండియా ఫైనాన్సియల్ కన్సల్టెంట్ రుమ్కీ మజుందార్ మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగిత రేటు 5.3 శాతంగా ఉండగా, తెలంగాణలో అది 9.9 శాతంగా ఉండడం గమనార్హం.

Also Read:Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి..